దేశంలోని కళాశాల, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించడానికి ఉద్దేశించిన ‘సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌’ నోటిఫికేషన్‌ను కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఏటా మొత్తం 82,000 మంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తారు. వీటిలో 50 శాతం మహిళలకు కేటాయించారు. డిగ్రీ, పీజీ, మెడిసిన్‌, ఇంజినీరింగ్‌ కోర్సులు చేస్తున్న విద్యార్థులు అర్హులు. దూరవిద్య కోర్సులు చేస్తున్నవారికి ఈ పథకం వర్తించదు.


వివరాలు...


* సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2023-24


స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 82,000 


అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 80 శాతం మార్కులతో ఇంటర్‌ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. గుర్తింపు పొందిన కళాశాలల్లో డిగ్రీ లేదా పీజీ కోర్సులు చదువుతుండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.4.5 లక్షలకు మించకూడదు. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా.


స్కాలర్‌షిప్‌: ఒక్కో విద్యార్థికి అయిదేళ్ల వరకు ఉపకారవేతనం అందిస్తారు. డిగ్రీ స్థాయిలో మూడేళ్లపాటు ఏటా రూ.12,000; పీజీ స్థాయిలో రెండేళ్లపాటు ఏటా రూ.20,000 చెల్లిస్తారు. బీఈ/ బీటెక్‌ కోర్సుల్లో చేరినవారికి మొదటి మూడేళ్లు ఏటా రూ.12,000; చివరి ఏడాది రూ.20,000 ఇస్తారు. 


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 31.12.2023.


Notification


Website


ALSO READ:


విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్, ఫెలోషిప్‌ సాయం పెంపు - ఎప్పటినుంచి వర్తిస్తుందంటే?
విద్యార్థులకు యూజీసీ ఫెలోషిప్‌ల కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పెంచింది. దీనివల్ల దేశంలోని దాదాపు 31 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చూకూరనుంది. 2023 జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని యూజీసీ పేర్కొంది. 2023, జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని యూజీసీ పేర్కొంది. పెరిగిన ఈ ఫెల్‌షిప్ మొత్తాలు ప్రస్తుతం యూజీసీ నుంచి ఫెలోషిప్స్ పొందుతున్నవారికి మాత్రమే వర్తించనున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


డిప్లొమా మహిళలకు ఉపకారవేతనాలు - అర్హత, ఇతర వివరాలు ఇలా
మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్‌’  నోటిఫికేషన్‌ వెలువడింది.  ‘ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)’ ఏటా ఈ ఉపకారవేతనం అందిస్తోంది. డిప్లొమా చదువుతున్న అర్హులైన అమ్మాయిలకు ఈ స్కీమ్ కింద ఆర్థికసాయం అందిస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు.  ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సరైన అర్హతలున్న మహిళలు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా స్కాలర్‌షిప్ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అక్టోబరు 31తో ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ముగియనుంది.
స్కాలర్‌షిప్ వివరాల కోసం క్లిక్ చేయండి..


మహిళా 'ప్రతిభ'కు చేయూత 'ప్రగతి' స్కాలర్‌షిప్‌, దరఖాస్తుకు చివరితేది ఎప్పుడంటే?
మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్‌’  నోటిఫికేషన్‌ వెలువడింది. ‘ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)’ ఏటా ఈ ఉపకారవేతనం అందిస్తోంది. సాంకేతిక డిగ్రీ కోర్సులు చదువుతున్న అర్హులైన అమ్మాయిలకు ఈ స్కీమ్ కింద ఆర్థికసాయం అందిస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు. ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సరైన అర్హతలున్న మహిళలు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా స్కాలర్‌షిప్ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. డిసెంరు 31తో ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ముగియనుంది.
పూర్తివివరాలకు క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..