విద్యార్థులకు యూజీసీ ఫెలోషిప్‌ల కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పెంచింది. దీనివల్ల దేశంలోని దాదాపు 31 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చూకూరనుంది. 2023 జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని యూజీసీ పేర్కొంది. 2023, జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని యూజీసీ పేర్కొంది. పెరిగిన ఈ ఫెల్‌షిప్ మొత్తాలు ప్రస్తుతం యూజీసీ నుంచి ఫెలోషిప్స్ పొందుతున్నవారికి మాత్రమే వర్తించనున్నాయి.


➥ ఇప్పటివరకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద రెండేళ్లపాటు నెలకు రూ.31 వేలు, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద రూ.35 వేలు ఇచ్చేవారు. ఇప్పుడా మొత్తాన్ని వరుసగా రూ.37 వేలు, రూ.42 వేలకు పెంచింది. అదేవిధంగా సావిత్రిబాయి జ్యోతిరావు ఫులే ఫెలోషిప్ ఫర్ 'సింగిల్ గర్ల్ చైల్డ్‌'కు కూడా పై మొత్తం వర్తించనుంది. 


➥డీఎస్ కొఠారి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌నకు రూ.47 వేల నుంచి రూ.54 వేల వరకు (మూడేళ్లు) ఇవ్వగా...దాన్ని రూ.58 వేల నుంచి రూ.67 వేలకు పెంచారు. 


➥ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ చేసే మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే ఫెలోషిప్ మొత్తాన్ని మొదటి సంవత్సరం రూ.47 వేల నుంచి రూ.58 వేలకు; రెండో ఏడాది రూ.49 వేల నుంచి రూ.61 వేలకు, మూడో ఏడాది రూ.54 వేల నుంచి రూ.67 వేలకు పెంచింది. 



ALSO READ:


డీఆర్‌డీవో-కాన్పూర్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్, వివరాలు ఇలా
కాన్పూర్‌లోని డీఆర్‌డీవో ఆధ్వర్యంలో డిఫెన్స్ మెటీరియల్స్ అండ్‌ స్టోర్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఎంఎస్‌ఆర్‌డీఈ), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీ, వ్యాలిడ్‌ నెట్‌/ గేట్‌ స్కోరు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నవంబరు 3న జరిగే వాక్‌ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


యూజీసీ 'వాట్సాప్‌ ఛానల్‌' ప్రారంభం, విద్యార్థులకు మరింత చేరువగా సేవలు
దేశంలోని ఉన్నత విద్యాసంస్కరణల్లో భాగంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు మరియు అధ్యాపకులు మరియు ఇతర వాటాదారులందరితో అనుసంధానం కోసం కొత్త వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం 'యూజీసీ వాట్సాప్ ఛానెల్‌'ను ప్రారంభించింది. అందరికీ అధికారిక సమచారాన్ని వేగంగా అందించడం కోసం దీన్ని ప్రారంభించినట్లు ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. యూజీసీ ఇండియా వాట్సాప్ ఛానెల్‌ని ప్రారంభించడం అనేది మరింత సమగ్రమైన మరియు సమాచారంతో కూడిన ఉన్నత విద్యా రంగాన్ని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన అన్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


విద్యార్థులకు 'ప్రత్యేక గుర్తింపు సంఖ్య', త్వరలోనే అమల్లోకి కొత్త విధానం!
దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. విద్యార్థి ఎల్‌కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు.. వీటికి సంబంధించిన పూర్తివివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఒక్కో విద్యార్థికి, ఒక్కో ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించాలని నిర్ణయించింది. దాన్ని ఆధార్ సంఖ్యతోపాటు 'అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్(ఏబీసీ)' అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించనుంది. ఈ విధానం త్వరలోనే అమల్లోకి తేనున్నారు. పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...