మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్’ నోటిఫికేషన్ వెలువడింది. ‘ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)’ ఏటా ఈ ఉపకారవేతనం అందిస్తోంది. సాంకేతిక డిగ్రీ కోర్సులు చదువుతున్న అర్హులైన అమ్మాయిలకు ఈ స్కీమ్ కింద ఆర్థికసాయం అందిస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు. ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సరైన అర్హతలున్న మహిళలు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా స్కాలర్‌షిప్ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. డిసెంరు 31తో ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ముగియనుంది.
వివరాలు..
* మహిళల ప్రగతి స్కాలర్‌షిప్ పథకం-2023
స్కాలర్‌షిప్‌ల సంఖ్య: దేశ వ్యాప్తంగా అయిదు వేల స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 566, తెలంగాణకు 424 కేటాయించారు.
స్కాలర్‌షిప్ మొత్తం: డిగ్రీ రెగ్యులర్ కోర్సులో చేరినవారికి నాలుగేళ్లు, లేటరల్ ఎంట్రీ అభ్యర్థులకు మూడేళ్లపాటు ఏటా రూ.50 వేలు అందిస్తారు.
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఏదేని టెక్నికల్ డిగ్రీ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో ప్రవేశం పొందినవారు కూడా అర్హులే. పదోతరగతి/ ఇంటర్ పూర్తిచేసిన రెండేళ్లలోపు ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో డిగ్రీ ప్రవేశాలు పొంది ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా.
స్కాలర్‌షిప్ ఎంతంటే?
కళాశాల ఫీజు, కంప్యూటర్ కొనుగోలు, సాఫ్ట్‌వేర్, స్టేషనరీ, బుక్స్, ఎక్విప్‌మెంట్ తదితరాల నిమిత్తం ఏడాదికి రూ.50,000లు ఇస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) విధానంలో నేరుగా అమ్మాయి బ్యాంక్ ఖాతాకు ఈ మొత్తాన్ని జమ చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.12.2023.
ALSO READ:
ఇంటర్ పాసైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, దరఖాస్తుకు డిసెంబరు 31 వరకు గడువు
తెలంగాణలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులై... ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు 'నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్'కు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్ అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 31 వరకు గడువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇంటర్ మార్కుల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలిచిన 53,107 మంది ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. కొత్త విద్యార్థులతోపాటు గతంలో స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన వారు కూడా రెన్యువల్ కోసం డిసెంబరు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
స్కాలర్‌షిప్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నీట్(యూజీ) సిలబస్ తగ్గింపు, ఈ సబ్జెక్టుల్లోనే ఎక్కువ కోత - విద్యార్థులపై తగ్గిన భారం!
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్(యూజీ) సిలబస్‌ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తగ్గించింది. విద్యార్థులపై భారం తగ్గించే విధంగా సిలబస్‌లో మార్పులు చేసింది. ఎన్‌ఎంసీ విడుదల చేసిన సిలబస్ ప్రకారం.. ఫిజిక్స్‌లో అధికంగా సిలబస్ తగ్గించారు. కెమిస్ట్రీలోనూ కొన్ని పాఠ్యాంశాలను తగ్గించారు. ఈ విద్యాసంవత్సరంలో నీట్(యూజీ) పరీక్షను 2024, మే 5న నిర్వహించనున్నారు. కాగా నీట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..