National Education Policy: కేంద్రం(Centre)లోని నరేంద్ర మోడీ(PM Narendramodi) ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ నూతన విద్యావిధానం(National Education Policy-NEP) అమలు ఇక, దేశవ్యాప్తంగా పరుగులు పెట్టనుంది. నిజానికి దీనిని తీసుకువచ్చి చాన్నాళ్లే అయినా.. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ అమలు దిశగా అడుగులు వేయలేదు. దీనికి కారణం కొన్ని కొన్ని కీలక సంస్కరణలు.. ఆయా రాష్ట్రాలకు రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు జాతీయ నూతన విద్యావిధానం వైపు మొగ్గు చూపడం లేదు. అందుకే.. ఇప్పుడు రాష్ట్రాల నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ.. కేంద్రం మాత్రం సవివరమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిని తప్పకుండా అన్ని రాష్ట్రాలు పాటించాలని కూడా స్పష్టం చేసింది.
జనవరి 2015లోనే జాతీయ విద్యావిధానానికి(NEP) బీజం పడింది. అది ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు తీసుకున్న తొలినాళ్లు. ఈ క్రమంలోనే ఆయన దేశవ్యాప్తంగా ఒకే విద్యావిదానం ఉండాలన్న లక్ష్యంతో దీనిని తీసుకువచ్చారు. మాజీ క్యాబినెట్ కార్యదర్శి T. S. R. సుబ్రమణియన్ ఆధ్వర్యంలోని కమిటీ కొత్త విద్యా విధానం కోసం సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. కమిటీ నివేదిక ఆధారంగా, జూన్ 2017లో ముసాయిదా NEPని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే.. దీనిపై విపక్షాలు, రాష్ట్రాలు అభ్యంతరం చెప్పడంతో మరోసారి దీనిని అధ్యయనం చేయించారు. ఆ తర్వాత.. నూతన విద్యా విధానం(NEP) 2020లో ఆమోదించారు.
త్రిభాషా సూత్రం..!
జాతీయ విద్యా విధానం-2020(NEP) ప్రకారం.. 5వ తరగతి వరకు మాతృభాష(Mother tongue) లేదా స్థానిక భాషను బోధనా మాధ్యమంగా ఉంచి తీరాలి. 8వ తరగతి తర్వాత నుంచి ఏ మాధ్యమమైనా ఇబ్బంది లేదు. సంస్కృతం, విదేశీ భాషలకు కూడా జాతీయ విద్యా విధానం ప్రాధాన్యత ఇచ్చింది. 'త్రి భాషా సూత్రం' ప్రకారం విద్యార్థులందరూ తమ పాఠశాలలో మూడు భాషలను నేర్చుకోవాలని తేల్చి చెప్పింది. మూడు భాషల్లో కనీసం రెండు భాషలైనా నేర్చుకోవాలనేది ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. అయితే.. ఇదే వివాదానికి దారి తీసింది. తమిళనాడు సహా కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లో భారీ ఎత్తున ఉద్యమాలు సాగాయి.
కేంద్రం తాజా ఆదేశాలు ఇవీ..
జాతీయ విద్యావిదానం మేరకు 1వ తరగతిలో(School) ప్రవేశానికి కనీస వయోపరిమితిని పాటించాల్సి ఉంటుంది. 1వ తరగతిలో ప్రవేశానికి పిల్లల వయస్సు కనీసం 6 సంవత్సరాలు నిండి ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి దీనిని అమలు చేయాలని పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతల్లో గ్రేడ్-1లో ప్రవేశానికి పిల్లల వయస్సు 6+ గా ఉండాల్సిం దేనని స్పష్టం చేసింది. ముఖ్యంగా అస్సాం, గుజరాత్, పుదుచ్చేరి, తెలంగాణ, లడఖ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, గోవా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ సహా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పిల్లలకు కనీసం 6 ఏళ్లు నిండి ఉంటేనే ఒకటవ తరగతిలో ప్రవేశం కల్పించాలని స్పష్టం చేసింది. చిన్నారుల విద్య విషయంలో.. మొదటి ఐదు సంవత్సరాలలో 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల వారికి సంబంధించిన మూడు సంవత్సరాల ప్రీస్కూల్, ఆరేళ్ల వయస్సు నుంచి ఎనిమిదేళ్ల వరకు రెండు సంవత్సరాల 1, 2 తరగతులు ఉంటాయి.
వివాదాలు ఇవీ..
+ త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తుండడంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
+ జాతీయ నూతన విద్యా విధానాలో ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడం.. 50 మంది చిన్నారులు (విద్యా ర్థులు..) ఉన్న పాఠశాలలను విలీనం చేయడం.. కూడా విలీనం చేయడం గమనార్హం.
+ ఉపాధ్యుల-విద్యార్థుల నిష్పత్తిని పెంచడం. తద్వారా టీచర్ పోస్టులను తగ్గించడం.
+ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో 4-సంవత్సరాల మల్టీ-డిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీని ప్రతిపాదించింది.