AP EAPCET 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో మే, జూన్ నెలల్లో నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి  రీషెడ్యూల్ చేసింది. ఇందులో ముఖ్యంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'ఏపీ ఈఏపీసెట్(AP EAPCET 2024)' పరీక్ష షెడ్యూలు మారింది. మొదట నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం మే 13 నుంచి 19 వరకు ఎప్‌సెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా.. అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగాలకు మే 16, 17 తేదీల్లో; ఇంజినీరింగ్ విభాగానికి మే 18 - 22 వరకు పరీక్షలు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. 


అదేవిధంగా, ఏపీ పీజీసెట్ పరీక్ష జూన్ 3 నుంచి 7 వరకు జరగాల్సి ఉండగా.. వాటిని జూన్ 10 - 14 మధ్య నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే ఆర్‌సెట్‌కు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఆర్‌సెట్ పరీక్షలను మే 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ నజీర్ అహ్మద్ వెల్లడించారు. ఈ మేరకు మార్చి 20న అధికారిక ప్రకటన విడుదల చేశారు. 



ALSO READ:


షెడ్యూలు కంటే ముందుగానే 'నీట్‌ పీజీ-2024' ప్రవేశ పరీక్ష, కొత్త తేదీ ఇదే!
శంలోని మెడికల్ కళాశాలల్లో పీజీకోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ - పీజీ (NEET PG) పరీక్ష తేదీ మారింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 7న నీట్ పీజీ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. పరీక్ష తేదీని ముందుకు జరిగి జూన్ 23న నిర్వహించనున్నట్లు నేషనల్ మెడికల్ కమిషన్ మార్చి 20న ఒక ప్రకటనలో తెలిపింది. అయితే అంతకుముందు నీట్ పీజీ పరీక్షను మార్చి 3న నిర్వహించాల్సి ఉండగా.. జులై 7కు వాయిదావేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పరీక్ష తేదీలో మరోసారి మార్పులు చేశారు. నీట్ పీజీ ఫలితాలను జులై 15న వెల్లడించే అవకాశం ఉంది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 5 నుంచి అక్టోబరు 15 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 16 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ప్రవేశాలు కోరేవారు అక్టోబరు 21లోగా సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. నీట్‌ పీజీ పరీక్ష రాసే అభ్యర్థుల అర్హతకు సంబంధించిన కటాఫ్‌ తేదీని ఆగస్టు 15, 2024గా నిర్ణయించింది. దీని ప్రకారం ఆగస్టు 15 లేదా అంతకన్నా ముందు ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేసిన ఎంబీబీఎస్‌ విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షను రాసేందుకు అవకాశం ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


Related  Articles:


పాలీసెట్‌ అభ్యర్థులకు అలర్ట్‌, పరీక్ష షెడ్యూలులో మార్పు, కొత్త తేదీ ఇదే!


ఐసీఏఐ సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల కొత్త షెడ్యూలు విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే!

 

ఐసీఎస్‌ఐ సీఎస్ పరీక్షల తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూలు ఇదే

 

ఏపీ ఎప్‌సెట్-2024 పరీక్ష తేదీల్లో మార్పు, పీజీసెట్ తేదీ మారే అవకాశం!

 

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్-2024 పరీక్ష వాయిదా - కొత్త తేదీ ఇదే

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...