ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో బడి గంటలు మోగనున్నాయి. ఏపీలో ఈ నెల 16వ తేదీ నుంచి పాఠశాలలను రీఓపెన్ చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి వెల్లడించారు. కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే పాఠశాలలను తెరవనున్నట్లు తెలిపారు. కోవిడ్‌కు ముందు ఉన్నట్లుగానే సాధారణ పనివేళల్లోనే స్కూళ్లను నడిపిస్తామని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి అయిందని.. మిగతా వారికి కూడా టీకాలు వేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ క్లాసులు జరగడం లేదని స్పష్టం చేశారు. 


16 నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులు..
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు ఇంటర్ బోర్డు బోర్డు సెక్రటరీ రామకృష్ణ వెల్లడించారు. తరగతుల ఏర్పాట్లకు తగిన చర్యలు తీసుకోవాలని కాలేజీల యాజమాన్యాలకు సూచించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


Read More: AP Inter 2nd year Class: ఏపీలో 16 నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులు..


తెలంగాణలో స్కూళ్ల రీఓపెన్ ఎప్పుడు?
తెలంగాణలో కూడా స్కూళ్లు తెరవడంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశానికి ముందు రోజు దీనికి సంబంధించి నివేదికను సమర్పించామని, కానీ ఆ విషయం కేబినెట్‌లో చర్చించలేదని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 15వ తేదీ తర్వాత స్కూళ్లను దశల వారీగా ప్రారంభించాలని తాము సూచించామని చెప్పారు. 


Also read: AP Inter College Reopen: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కరోనా నిబంధలు వచ్చేశాయి... ఈ రూల్స్ పాటించకుంటే సమస్యలు తప్పవు


కోవిడ్ మహమ్మారి వల్ల పిల్లల చదువులన్నీ గందరగోళంలో పడ్డాయి. కోవిడ్ సెకండ్ వేవ్‌కు ముందు స్కూళ్లు తెరిచినప్పటికీ కేసులు పెరిగిపోవడంతో స్కూళ్లను మూసేయాల్సి వచ్చింది. ఇప్పుడు సెకండ్ వేవ్‌లో కేసులు తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ స్కూళ్లు తెరవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.


Read More: School Reopen: తెలంగాణలో స్కూళ్ల రీఓపెన్ ఎప్పుడు? విద్యాశాఖ ఏం చెప్పిందంటే.. మరి సర్కార్ ఒప్పుకుంటుందా?


Also Read: TS CPGET 2021: ఒకే పరీక్షతో ఏడు వర్సిటీల్లో ప్రవేశాలు.. సీపీజీఈటీ నోటిఫికేషన్‌ విడుదల.. అప్లై చేసేటప్పుడు వీటిని మర్చిపోవద్దు