ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లించేందుకు డిసెంబరు 19 వరకు అవకాశం కల్పించినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. అయితే  రూ.120 ఆలస్య రుసుముతో డిసెంబరు 26 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 2 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో జనవరి 9 వరకు, రూ.2,000 ఆలస్య రుసుముతో జనవరి 17 వరకు, రూ.3,000 ఆలస్య రుసుముతో జనవరి 23 వరకు, రూ.5,000 ఆలస్య రుసుముతో జనవరి 30 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది. విద్యార్థులు పరీక్ష ఫీజు దరఖాస్తుకు రూ.10, పరీక్ష ఫీజు కింద రూ.700 చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిల్ అయినవారు, హాజరు మినహాయింపు కోరే ప్రైవేటు విద్యార్థులు, గ్రూపు మార్చుకున్నవారు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా డిసెంబరు 19 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.



పరీక్ష ఫీజు వివరాలు ఇలా..



ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, వచ్చే ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టీకల్ పరీక్షలను ఫిబ్రవరి 8 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 22 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. మే మొదటివారంలో ఇంటర్ ఫలితాలు వెలుడతాయి. ఇక మే చివరివారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 


Also Read:


దేశంలో 66 శాతం పాఠశాలల్లో 'నో' ఇంటర్నెట్, అధ్వాన్న స్థితిలో బీహార్, మిజోరం రాష్ట్రాలు


భారతదేశంలో దాదాపు 66% పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. బీహార్, మిజోరాం రాష్ట్రాలు ఈ కోవలో మొదటి రెండు స్థానాల్లో నిలుస్తున్నాయి. బీహార్‌లో 92%, మిజోరంలో 90% పాఠశాలల్లోని విద్యార్థులు ఇంటర్నెట్ మాటే ఎరుగరు. ఇక ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ మరియు కాశ్మీర్, మధ్యప్రదేశ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, ఒడిశా, తెలంగాణ, త్రిపుర రాష్ట్రాల్లో 80-85%. పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (UDISE+) నివేదిక 2021–22 ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక పాఠశాల విద్యకు సంబంధించిన డేటాను క్రోడీకరించడానికి విద్యా మంత్రిత్వ శాఖ తోడ్పాటునిచ్చింది.


ఇదిలా ఉండగా.. మరోవైపు ఢిల్లీ, లక్ష్వదీప్‌లలోని పాఠశాలలు 100% కంప్యూటర్ సౌకర్యాలతో పని చేస్తున్నాయని, వీటిలో 97.4% పాఠశాలలు ఇంటర్నెట్ యాక్సెస్‌తో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 100% పాఠశాలలు ఇంటర్నెట్ కనెక్షన్‌ను కలిగి ఉన్న ఏకైక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ఢిల్లీ. ఆ తర్వాతి స్థానాల్లో చండీగఢ్ (98.7%), పుదుచ్చేరి (98.4%) కేంద్రపాలిత ప్రాంతాలు నిలిచాయి. ఇక రాష్ట్రాల విషయానికొస్తే 94.6 శాతంతో కేరళ, 92 శాతంతో గుజరాత్ ఇంటర్నెట్ సదుపాయాలు అత్యుత్తమ పనితీరు గల రాష్ట్రాలుగా నిలిచాయి. దేశంలో ప్రైవేట్ పాఠశాలల కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఏకైక రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. గుజరాత్‌లో 94.2 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయాలు ఉండగా, ప్రైవేట్ స్కూళ్లలో 89.6 శాతం సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. సర్వే ప్రకారం గుజరాత్‌లో మినహాయించి మొత్తంగా.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య అంతరం కొనసాగుతోంది. సర్వేలో 59.6% ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయాలు ఉండగా.. ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలల్లో 53.1 శాతం ఇంటర్నెట్ సదుపాయాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 24.2% మాత్రమే సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.


సర్వే చేయబడిన పాఠశాలల్లో 50% కంటే తక్కువ పాఠశాలల్లో కంప్యూటర్‌లు పనిచేస్తున్నాయి. ఆన్‌లైన్ తరగతుల కోసం కేవలం 20% మాత్రమే మొబైల్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఇక స్మార్ట్ తరగతుల లభ్యత కూడా చాలా తక్కువగానే ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. దేశంలోని 1.4 మిలియన్ల పాఠశాలల్లో 2,22,155 మాత్రమే డిజిటల్ లేదా స్మార్ట్ బోర్డులతో స్మార్ట్ తరగతులు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో 99.99 % పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు ఉండటం విశేషం. పంజాబ్, హర్యానా, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో 90 శాతానికి పైగా స్మార్ట్ తరగతులు ఉన్నాయి. మరోవైపు, తమిళనాడులో ఒక్కటంటే ఒక్క స్మార్ట్ క్లాస్ రూమ్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక మిజోరంలో ఉన్న 3911 పాఠశాలల్లో, కేవలం 25 పాఠశాలలు మాత్రమే స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను కలిగి ఉన్నాయి.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..