Andhra Pradesh SSC Results 2025 Check Here: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పదోతరగతి ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఫలితాలను విజయవాడలో రిలీజ్ చేస్తారు. మొన్న ఇంటర్ ఫలితాలను వాట్సాప్‌లో పొందినట్టుగానే ఇప్పుడు పదోతరగతి ఫలితాలను కూడా పొందవచ్చు. 

SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు, ఓపెన్ స్కూల్ పదో తరగతి ఫలితాలతోపాటు ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలను కూడా బుధవారం విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఈ ప్రకటన చేశారు. 

ఈసారి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌, మన మిత్ర వాట్సాప్‌, లీప్ యాప్‌ ద్వారా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ కొత్త విధానంతోపాటు https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్ల ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. 

వాట్సాప్‌లో ఫలితాలు ఎలా తెలుసుకోవాలి?ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 9552300009 నెంబర్‌లో వాట్సాప్ సర్వీలు ఆరు నెలల క్రితం ప్రారంభించింది. దీని వాట్సాప్‌ నెంబర్ సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేస్తే కావాల్సిన సేవలు పొందవచ్చు. ఈ మన మిత్ర యాప్ ద్వారా 250కిపైగా సేవలు పొంద వచ్చు. తాజాగా వివిధ పరీక్షల ఫలితాలను కూడా ప్రభుత్వం ఇందులోనే విడుదల చేస్తోంది. 

ముందుగా వాట్సాప్ నెంబర్‌ 9552300009 సేవ్ చేసుకొని హాయ్ అని పంపించారు. అటు నుంచి రిప్లై వస్తుంది. కావాల్సిన సేవ ఎంచుకోండి అని చెబుతుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మన మిత్రలో లభించే సేవల లిస్ట్ చూడవచ్చు. అందులో విద్యా సేవలు ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో లభించే సేవల లిస్ట్ వస్తుంది. అక్కడ SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. 

పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు అని ఉన్న చోట క్లిక్ చేస్తే మీ రోల్ నెంబర్ అడుగుతుంది. అందులో మీ రిజిస్టర్ నెంబర్ వేసి సబ్‌మిట్ కొడితే కాసేపటికి మీ ఫలితం పీడీఎఫ్‌ రూపంలో వస్తుంది. వాట్సాప్‌లో పొందిన పదోతరగతి పీడీఎఫ్‌ ఫలితాలను మీరు కాలేజీలో జాయినింగ్‌కు వాడుకోవచ్చు. ఒరిజినల్ పత్రాలు మీకు అందే వరకు దీన్ని వివిధ పోటీ పరీక్షల కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు.