అమ్మాయిల అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. యవ్వనానికి మించిన అందమే ఉండదని అంటారు. అందుకే ఆ యవ్వనాన్ని కాపాడుకోవడానికి.. అలాగే మరింత సౌందర్యవంతంగా కనిపించేందుకు తెగ తాపత్రయపడుతుంటారు మహిళలు. మేకప్, టచప్ అంటూ చాలా రకాల కాస్మొటిక్ ప్రోడక్ట్స్‌తోపాటు తమ పెదవులు సైతం అందంగా కనిపించేందుకు లిప్‌స్టిక్స్‌ను వాడుతుంటారు.
పెదవులు ఎర్రగా, మృదువుగా ఉండాలని వివిధ బ్రాండ్‌ల లిప్‌స్టిక్స్ వాడుతుంటారు. అయితే పెదవులపై లిప్‌స్టిక్ ఉన్నంతసేపు బాగానే అనిపించినప్పటికీ.. భవిష్యత్తుల్లో అనేక దుష్ఫలితాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని వైద్య నిఫుణులు హెచ్చరించారు. ఆరోగ్యాన్ని మించిన అందం లేదనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనం పూర్తి ఆరోగ్యంగా ఉండడమే గొప్ప అందం. చాలా మంది అనేక రకాల అనారోగ్యాలకు గురవుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ..నరకం అనుభవిస్తున్నారు. మరికొందరు అందం కోసం రకరకాల క్రీములు వాడుతూ లేని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు.
లిప్‌స్టిక్‌ను పెదవులకు అప్లై చేయడం కూడా ప్రమాదమేనని అంటున్నారు డాక్టర్లు. అంతేకాదు.. లిప్‌స్టిక్ తయారీలో జంతువుల చర్మం, పలు క్రీములతో రెడీ చేస్తారన్న వార్త ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చదివేందుకు కాస్త షాకింగ్‌గా ఉన్నప్పటికీ.. లిప్‌స్టిక్ తయారు చేయడానికి జంతువులతో పాటు పలు కీటకాల వివిధ శరీర భాగాలను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ అధ్యయనం ప్రకారం లిప్‌స్టిక్ రంగును తయారు చేయడానికి మాంగనీస్, సీసం, కాడ్మియం ఉపయోగిస్తారని తేలింది. లిప్ స్టిక్ వాడటం వల్ల రకరకాల అలర్జీలు సంభవిస్తాయి. ఒక పరిశోధన ప్రకారం పెదవులకు అప్లై చేసే బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో చాలా కెమికల్స్ వాడుతున్నారు. ఈ రసాయనాల్లో సీసం కూడా ఉంటుంది. పెదవులపై లిప్ స్టిక్ అప్లై చేయడం వల్ల నోటి ద్వారా అది పొట్టలోకి చేరుతుంది. ఇది రకరకాల కడుపు సమస్యలను కలిగిస్తుంది. అయితే నిజానికి.. లిప్‌స్టిక్ అనేది చాలా ఏళ్ల క్రితమే.. ప్రాచూర్యంలోకి వచ్చింది.
1884 కాలంలో ఫ్రెంచ్ బ్రాండ్‌ను గెర్లిన్ తయారు చేశాడు. ఇప్పుడు ఈ బ్రాండ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లిప్‌స్టిక్ తయారీకి ప్రసిద్ధి చెందింది. అయితే పూర్వం లిప్‌స్టిక్‌నుక స్త్రీలు పలు ఎర్రటి రాళ్లను పగలగొట్టి, వాటిని చాలా సన్న నలిపి వాటిని పెదాలకు పెట్టుకునే వాళ్లంట. అయితే మారుతున్న కాలానుగూణంగా లిప్‌స్టిక్స్‌లో కెమికల్స్‌తో జంతువుల కళేబరాలు కలుపుతూ వస్తున్నారు. అయితే మహిళలు ఇలాంటి రసాయన లిప్‌స్టిక్‌లు మానేసి సహజసిద్దంగా తయారుచేసినా మూలికా లిప్‌స్టిక్‌లని ఎంచుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిఫుణులు.
లిప్‌స్టిక్‌ను తయారు చేయడానికి ఉపయోగించే సీసం గర్భధారణకు కూడా ప్రమాదకరమంటున్నారు. ఇది గర్భిణీకి ఆమె పిండానికి హాని కలిగిస్తుందని, లిప్ స్టిక్ ద్వారా కడుపులోకి చేరి తద్వారా రక్తంలో సీసం స్థాయి పెరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా గర్భిణీలు లిప్‌స్టిక్‌కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.
ఇంకొన్ని బ్రాండేడ్ కంపెనీలకు సంబంధించిన లిప్‌స్టిక్ తయారీలో నూనె, మైనం, పిగ్మెంట్లు, మొదలైనవాటిని ఉపయోగిస్తారు. లిప్ స్టిక్ పెదవులకు ఎక్కువసేపు అంటుకుని ఉండటం కోసం.. అనేక రకాల ప్రిజర్వేటివ్స్, ఆల్కహాల్ మొదలైన వాటిని కూడా ఉపయోగిస్తారు. ఇది కాకుండా, కంపెనీ అనేక ఇతర వస్తువులను కూడా ఉపయోగిస్తుంది, కానీ వాటికి సంబంధించిన సమాచారం పబ్లిక్‌గా చెప్పదు.