ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) -2021 పరీక్షల హాల్‌టికెట్లు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను sche.ap.gov.in వెబ్‌సైట్‌, ఏపీఎస్‌సీహెచ్ఈ మైసెట్ (APSCHE myCET) యాప్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబరు లేదా మొబైల్ నంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఇచ్చి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


ఈ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీటెక్‌ అగ్రి ఇంజనీరింగ్, బీటెక్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బీఎస్సీ (అగ్రి), బీఎస్సీ (హార్టికల్చర్‌), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/ బీఎఫ్‌ఎస్సీ, బీ-ఫార్మసీ, ఫార్మా డీ కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) తరఫున జేఎన్టీయూ, కాకినాడ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. 


Also Read: CBSE Class 10, 12 Result Update: ఈ నెల 25 నుంచి సీబీఎస్ఈ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు.. ఇవే పూర్తి వివరాలు


ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో జరుగుతాయి. ఇక అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం పరీక్షలను సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ప్రిలిమినరీ కీ తేదీలను ఇంకా వెల్లడించలేదు. 


ఇంట‌ర్ వెయిటేజీ తొల‌గింపు
ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కాలేజీల‌లో ప్రవేశాలకు ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కుల‌ను తొల‌గించిన‌ట్లు రాష్ట్ర ఇంట‌ర్ బోర్డు ఇటీవల ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. కోవిడ్19 కార‌ణంగా ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించ‌డానికి అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఏపీ ఉన్న‌త విద్యా మండ‌లి కొన్ని మార్పులు చేర్పులు చేసింది. గ‌తేడాది వ‌ర‌కు ఈ ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల‌లో విద్యార్థుల ఇంట‌ర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చేవారు. 


ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ ఖరారైంది. దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో నేటి (ఆగస్టు 13) నుంచి ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. రెగ్యులర్‌తో పాటు ఒకేషనల్ కోర్సులకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఈసారి ప్రవేశాలను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహిస్తామని ప్రకటించారు. 


Read More: AP Inter Admissions: ఏపీలో ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?


ALso Read: AP Schools Reopen Date: ఈ నెల 16 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభం.. సాధారణ టైమింగ్స్‌లోనే..