నాల్గో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థుల కోసం ఆల్‌ఇండియ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ ఎగ్జామ్‌(AISTE)2022 పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో మంచి మార్కులు వచ్చిన వాళ్లకు స్కాలర్‌షిప్ ఇవ్వబోతోంది. నాలుగు నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. 


ఇందులో అర్హత సాధించిన వాళ్లకు ఏడాది పాటు 90వేల రూపాయల స్కాలర్‌షిప్‌తోపాటు పుస్తకాలు ఇస్తారు. ప్రతిభా ధ్రువపత్రాన్ని కూడా ఇస్తారు.


ఆసక్తి ఉన్న విద్యార్థులు ఫిబ్రవరి 20లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 


స్కాలర్‌షిప్‌ 2022కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇవే:
అప్లికేషన్ డెడ్‌లైన్: 20వ ఫిబ్రవరి 2022


ఎగ్జామ్‌ తేదీ: 27మార్చి 2022


హాల్‌టికెట్స్‌ ఇచ్చే తేదీ: 1 మార్చి 2022






ఫలితాలు విడుదల: 28మార్చి 2022


స్కాలర్‌షిప్‌ పరీక్షకు ఎవరు అర్హులు:
నాల్గోతరగతి నుంచి ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఈ పరీక్ష రాసేందుకు అర్హులే. 


స్కాలర్‌షిప్ టెస్టు రాస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి?:
మొదటి బహుమతి: 90వేల రూపాయల స్కాలర్‌షిప్‌, పుస్తకాలు, ప్రతిభా పత్రం


రెండో బహుమతి: 70వేల రూపాయలు, పుస్తకాలు, ప్రతిభా పత్రం


మూడో బహుమతి: 50వేల రూపాయలు, పుస్తకాలు,  ప్రతిభా పత్రం


ఆల్‌ఇండియా స్కాలర్‌షిప్‌నకు ఎలా అప్లై చేయాలి?:


ఆల్‌ఇండియా స్కాలర్‌ షిప్‌ టెస్టు ఎగ్జామ్‌ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. అందులో అడిగిన వివరాలను పూర్తిగా ఫిల్ చేయాలి. అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. 


ఆల్‌ఇండియా స్కాలరకర్‌షిప్‌ టెస్టు 2022 అప్లికేషన్ ఫీజు:


ఆసక్తి ఉన్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ కోసం 249రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 


అప్లై చేసుకున్న విద్యార్థులకు ముఖ్య సూచనలు:


మీరు నివసించే జిల్లాలోనే ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. ఎన్ని అప్లికేషన్లు వచ్చినా టాప్‌ మార్కులు వచ్చిన రెండు వందల మందిని సెలెక్ట్‌ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. స్కూల్‌లో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఫ్యామిలీ ఆదాయాన్ని కూడా అడిగి తెలుసుకుంటారు. వీటన్నింటినీ బేస్‌చేసుకొని 200 మందికి స్కాలర్‌ మంజూరు చేస్తారు.