తెలంగాణలో 'టీఎస్ సెట్-2023' పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 28, 29, 30 తేదీల్లో సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగనున్నాయి. ఈసారి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 40,838 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోవాలని, లేనిపక్షంలో పరీక్షకు అనుమతించరు.
పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణతోపాటు ఏపీలోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ నగరాల్లో; ఏపీలో కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు అర్హత సాధించేందుకు ప్రభుత్వం ఏటా టీఎస్ సెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పరీక్ష నిర్వహణ బాధ్యతను ఉస్మానియా విశ్వవిద్యాలయం చేపట్టింది. మొత్తం 29 సబ్జెక్టలకు పరీక్షలు నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం..
మొత్తం 29 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
సబ్జెక్టులు: జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.
ALSO READ:
ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులు, ప్రవేశాలు ఇలా
గుంటూరులోని ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు. ఈ కోర్సుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభంకాగా.. నవంబరు 3 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పీజీ కోర్సులకు డిగ్రీ మార్కులు, ఏఐఈఈఏ (ఐకార్) స్కోరు; పీహెచ్‌డీ కోర్సులకు డిగ్రీ, పీజీ మార్కులు, ఏఐసీఈ (ఐకార్) స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.750 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీలో పీజీడీఎం ప్రోగ్రామ్, ఈ అర్హతలుండాలి
పుణెలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ, 2024 విద్యా సంవత్సరానికి పీజీడీఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్, ఎక్స్‌ఏటీ, సీమ్యాట్ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..