తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు అక్టోబరు 26న ప్రకటించింది. జూనియర్ కాలేజీలు నవంబర్ 14 వరకు విద్యార్థుల నుంచి ఫీజులు స్వీకరించాలని ఆయా ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 20 వరకు ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించే అవకాశం ఉందని తెలిపింది. ఇంటర్ మొదటి సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.510, వొకేషనల్ రెగ్యులర్ విద్యార్థులు రూ.730, సెకండియర్ ఆర్ట్స్ విద్యార్థులు రూ. 510, సైన్స్, వొకేషనల్ విద్యార్థులు రూ. 730 చొప్పున ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు వివరించింది.
విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకు, రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 16 నుంచి నవంబర్ 23 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. అలాగే రూ.500 ఆలస్య రుసుముతో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఇక రూ.1,000 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 13 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. చివరిగా రూ.2,000 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 20 వరకు పరీక్ష ఫీజు చెల్లించు అవకాశం కల్పించారు.
పరీక్ష ఫీజు వివరాలు..
➥ ఇంటర్ ఫస్టియర్ జనరల్ విద్యార్థులు రూ.510
➥ ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్, ప్రాక్టికల్స్‌తో విద్యార్థులు రూ.730.
➥ ఇంటర్ సెకండియర్ జనరల్ (ఆర్ట్స్) విద్యార్థులు రూ.510.
➥ ఇంటర్ సెకండియర్ జనరల్ (సైన్స్) విద్యార్థులు రూ.730.
➥ ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులు రూ.730.
ఇంటర్ 'హాజరు' మినహాయింపు ఫీజు గడువు నవంబరు 18తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో చదువకుండా హాజరు మిహాయింపు ద్వారా ఇంటర్ పరీక్షలు రాసే అవకాశాన్ని ఇంటర్‌బోర్డు కల్పించింది. విద్యార్థులు నేరుగా పరీక్ష ఫీజు చెల్లించి ఇంటర్ పరీక్షలకు హాజరుకావచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించి, అక్టోబరు 20 నుంచి నవంబర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.200 ఆలస్య రుసుముతో నవంబర్ 30 వరకు అవకాశం ఉంది. పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..