తెలంగాణలోని జూనియర్‌ కాలేజీల్లో చదువకుండా హాజరు మిహాయింపు ద్వారా ఇంటర్‌ పరీక్షలు రాసే అవకాశాన్ని ఇంటర్‌బోర్డు కల్పించింది. విద్యార్థులు నేరుగా పరీక్ష ఫీజు చెల్లించి ఇంటర్ పరీక్షలకు హాజరుకావచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించి, అక్టోబరు 20 నుంచి నవంబర్‌ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.200 ఆలస్య రుసుముతో నవంబర్‌ 30 వరకు అవకాశం ఉంది. 


ఇంటర్మీడియట్ విద్యను ప్రైవేట్‌గా అభ్యసించే విద్యార్థులు పరీక్షలలో ఆర్ట్స్, హ్యుమానిటీస్ గ్రూప్‌తో చదివే అభ్యర్థులకు, సైన్స్ నుంచి ఆర్ట్స్, హ్యుమానిటీస్‌కు తమ గ్రూప్‌ను మార్చు కోవాలనుకునే వారికి అవకాశం కల్పించినట్టు ఇంటర్మీడియట్ కార్యదర్శి నవీన్ మిట్టల్ అక్టోబరు 18న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఇదివరకు మొదటి, ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన అభ్యర్థులు అదనంగా రెండో భాషగా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 


ALSO READ:


APBIE: ఇంటర్‌ విద్యార్థులకు 'స్టడీ అవర్స్', వారికి 'హాజరు' ఫీజు గడువు నవంబరు 30 వరకు
ఏపీలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్‌ నిర్వహించాలని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ అక్టోబరు 2న ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విద్యార్థులను చదివించాలని, ఆ సమయంలో విద్యార్థుల హాజరు నమోదు చేసి జిల్లా వృత్తివిద్యాధికారులకు పంపించాలని సూచించారు. సోమవారం నుంచి శనివారం వరకు ఏ రోజు ఏ సబ్జెక్టు చదివించాలనే వివరాలు సైతం తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


విద్యార్థుల కోసం 'అపార్' కార్డు, 'వన్‌ నేషన్-వన్‌ ఐడీ'కి కసరత్తు, రాష్ట్రాలను ఆదేశించిన కేంద్రం
‘ఆధార్‌’ తరహాలో విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అపార్(ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ) పేరుతో 'వన్‌ నేషన్-వన్‌ ఐడీ' కార్డును అందుబాటులోకి తేనున్నారు. విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలను కేంద్ర విద్యాశాఖ తాజాగా ఆదేశించింది. అపార్‌ ఐడీ కార్డును దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్నారు. ఈ అపార్‌ నెంబర్‌నే విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. దీంట్లో విద్యార్థి అకడమిక్‌ జర్నీ, విద్యా ప్రయాణం, విజయాలు నిక్షిప్తం అయ్యి ఉంటాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటర్‌ పాసైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, దరఖాస్తుకు డిసెంబరు 31 వరకు గడువు
తెలంగాణలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులై... ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు 'నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌'కు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 31 వరకు గడువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇంటర్‌ మార్కుల్లో టాప్‌-20 పర్సంటైల్‌లో నిలిచిన 53,107 మంది ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. కొత్త విద్యార్థులతోపాటు గతంలో స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన వారు కూడా రెన్యువల్‌ కోసం డిసెంబరు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 
స్కాలర్‌షిప్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...