Replacing Textbooks with Virtual Experiences : టెక్స్ట్​ బుక్​ని రిప్లేస్ చేస్తూ.. వర్చువల్ విధానంలో చదువును స్టూడెంట్స్​కు అందిస్తున్నామని.. ఈ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నరేశ్ వట్టికూటి గారు ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్ కాన్​క్లేవ్​లో తెలిపారు. అంతేకాకుండా ఈ కళాశాల​తో.. ఆన్​లైన్​ ద్వారా విద్యను అందిస్తున్నామని.. దీనివల్ల విద్యార్థులకు కలిగే లాభాలతో పాటు.. మరెన్నో ఇతర కీలక అంశాల గురించి ఆయన చర్చించారు. ఆ హైలెట్స్ చూసేద్దాం. 

ట్రెడీషనల్ టీచింగ్ టూ ఆన్​లైన్ టీచింగ్.. 

కొవిడ్ సమయంలో ట్రెడీషనల్ టీచింగ్ నుంచి ఆన్​లైన్ టీచింగ్​కి మారిన విధానం గురించి ఆయన మాట్లాడారు. ఆన్​లైన్​ టీచింగ్​కు ఈ కళాశాల ఎలా మారింది. విద్యార్థులకు ట్రెడీషనల్ టీచింగ్​ని ఎలా దూరం చేసిందనే అంశంపై వివరణ కోరగా.. ''ఈ కళాశాలలో ప్రారంభంలో మేము ఇండస్ట్రీ ఎలా 4.0 గురించి విన్నాము. ఇండస్ట్రీ 1.0 నుంచి 2.0కి.. అక్కడి నుంచి 3.0కి అప్​డేట్ అయింది. ఇప్పుడు 4.0లో ఉన్నాము. కానీ 1.0 నుంచి 2.0కి మారడానికి దాదాపు 90 సంవత్సరాలు పట్టింది. 2.0 నుంచి 3.0కి మారేందుకు 70 ఏళ్లు.. 3.0 నుంచి 4.0కి 50 సంవత్సరాలు పట్టింది. దీనిని పరిగణలోకి తీసుకుని విద్యను కూడా మేము అదే విధంగా మార్చాము. కానీ చదువులో ఎవరు 1.0, 2.0 అనేవి వివరించలేదు. కానీ.. ఇప్పుడు మనం విద్యలో 4.0లో ఉన్నామని ఈకళాశాల నిరూపించింది.'' అంటూ వివరణ ఇచ్చారు. 

ఈ కళాశాల విధానం ఏంటంటే.. విద్యార్థికి కావాల్సిన అన్ని అంశాలను ఒకే చోటు అందించాలనేదే మా కాన్సెప్ట్. విద్యను నేర్చుకునే విధానం, కాంపీటేషన్​ను ఎదుర్కొనే విధానం, స్కిల్స్ డెవలెప్ చేసుకునే విధానాన్ని అందరూ ఒకటే అనుకుంటారు. కానీ అవి వేరు. వాటికి తగ్గట్లుగా స్టూడెంట్స్​ని తయారు చేయడమే ఈ కళాశాల లక్ష్యమని చెప్పారు. 

టెక్స్ట్ బుక్స్​ని 3డితో రిప్లేస్ చేస్తే.. 

సాంకేతిక విద్యలో ముఖ్యంగా వర్చువల్ విధానంలో ఈ కళాశాల చాలా ముందుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్​లో పలు అంశాలపై దృష్టి పెట్టి దీనిని రూపొందించాము. IT, ECE, EEE, మెకానికల్, సివిల్ కోర్సులపై దృష్టి పెట్టి.. వాటిని 3డిలో రూపొందించాము. టెక్స్ట్​ బుక్​లోని అంశాన్ని అధ్యాపకులు వివరిస్తున్నప్పుడు స్టూడెంట్ ఆ ఇంజిన్ ఎలా ఉంటుందో.. లోపలి భాగాలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టంగా ఉంటుంది. 

ఓ వాహనం ఎలా ఉంటుందనేది ఊహించినా... దానిలోపలి భాగాలు ఎలా ఉంటాయనేది టెక్స్ట్ బుక్​ నుంచి ఊహించుకోవడం కష్టంగానే ఉంటుంది. దానికోసం స్టూడెంట్​ని ఇండస్ట్రీలకు, గ్యారేజీలకు తీసుకువెళ్లే బదులు.. గ్యారేజ్ లేదా ల్యాబ్​నే క్లాస్​రూమ్​కి తీసుకురావాలనుకుని 3డి విధానాన్ని అందుబాటులోకి తెచ్చాము. వర్చువల్ రియాలటీ విధానంలో గేమ్స్ ఎలా ఆడుతారో.. అదే విధంగా ఓ స్టూడెంట్ తనకు కావాల్సిన అంశాన్ని వర్చువల్ రియాలటీలో నేర్చుకుంటాడు. వాటిని టచ్ చేయడం, వాటిని డిస్​మ్యాటిల్ చేయడం వంటి వాటిని నిజంగా ఎక్స్​పీరియన్స్ చేసిన అనుభూతి పొందుతారు. ఇప్పటివరకు ఇంజనీరింగ్​లో దాదాపు 15,000 3D మోడళ్లను నిర్మించామని.. దాదాపు అన్ని ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లలో 3D మోడళ్లను రూపొందిస్తామని తెలిపారు.

దీనికి సంబంధించిన ఎన్నో అంశాలపై నరేశ్ వట్టికూటి ఏబీపీ ఎడ్యూ కాంక్లేవ్ లో వివరించారు. ఆ లింక్ ఇక్కడుంది. క్లిక్ చేసి చూసేయండి.