Uber faster pickup Row:  వేగంగా పికప్ చేసుకోవడానికి 'అడ్వాన్స్ టిప్' అనే మోడల్ ప్రవేశ పెట్టిన ఉబెర్ పై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ఈ పద్దతి చాలా ఆందోళనకరమైనదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు.  వేగవంతమైన సేవ కోసం వినియోగదారులను ముందస్తుగా టిప్ చెల్లించమని బలవంతం చేయడం  అనైతికమైనదని..  దోపిడీకి దారి తీస్తుందని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు అన్యాయమైన వాణిజ్య పద్ధతుల కిందకు వస్తాయన్నారు.


టిప్‌ను సేవ తర్వాత హక్కుగా కాకుండా ప్రశంసకు చిహ్నంగా ఇస్తారు. దీనిని గ్రహించి  CCPA ఈ విషయంలో ఉబెర్ నోటీసులు జారీ చేసింది. ఉబెర్  నుండి వివరణ కోరింది.





ఇదే కాదు ఇంతకు ముందు డిఫరెన్షియల్ ప్రైసింగ్ వివాదం పై కూడా ఉబెర్ కు నోటీసులు జారీ అయ్యాయి. జనవరి 23, 2025న, ప్రహ్లాద్ జోషి ఉబర్ మరియు ఓలా యాప్‌లు ఐఫోన్,  ఆండ్రాయిడ్ డివైస్‌లలో ఒకే రైడ్‌కు భిన్నమైన ధరలు వసూలు చేస్తున్నాయని ఆరోపణలపై CCPA ద్వారా నోటీసులు జారీ చేయించారు. ఈ విషయంలో జోషి "వినియోగదారుల దోపిడీపై జీరో టాలరెన్స్" విధానాన్ని ప్రకటించారు. ఈ రెండు వివాదాలు..అడ్వాన్స్ టిప్ ,  డిఫరెన్షియల్ ప్రైసింగ్) ఉబర్‌పై వినియోగదారుల నమ్మకాన్ని ప్రభావితం చేస్తున్నాయన్నఅభిప్రాయం వినిపిస్తోంది.  



ఉబెల్ అడ్వాన్ టిప్ ఫీచర్ గురించి ఫిర్యాదు చేయాలనుకుంటే, వినియోగదారులు ఉబర్ యాప్‌లోని "హెల్ప్" సెక్షన్ ద్వారా లేదా help.uber.com వద్ద ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అలాగే, CCPA హెల్ప్‌లైన్ (1915) లేదా jagograhakjago.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.


అయితే పలువురు ఉబర్ డ్రైవర్లు కూడా.. తమకు  సరిగ్గా చెల్లింపులు లేవని పోస్టులు పెడుతున్నారు.