Kothalavadi Teaser: రూటెడ్, పవర్‌ఫుల్ స్టోరీతో 'కొత్తలవాడి' - ప్రొడ్యూసర్‌గా రాకింగ్ స్టార్ యష్ తల్లి ఎంట్రీ.. టీజర్ చూశారా?
Kothalavadi Movie: కన్నడ రాకింగ్ స్టార్ యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ నిర్మాతగా మారారు. ఆమె రూపొందించిన ఫస్ట్ మూవీ 'కొత్తలవాడి' టీజర్ మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటోంది.
Yash Mother Produced Kothalavadi Movie Teaser: కేజీఎఫ్, కేజీఎఫ్ 2 వంటి హిస్టారికల్ హిట్స్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారారు యష్. ఇప్పుడు ఆయన తల్లి పుష్ప అరుణ్ కుమార్ తాజాగా నిర్మాతగా మారారు. న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో 'PA' ప్రొడక్షన్స్ పేరుతో ఆమె చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కన్నడ సినీ ఇండస్ట్రీలో సుప్రసిద్ధ యాక్టర్ డా.రాజ్ కుమార్, ఆయన సతీమణి పార్వతమ్మ రాజ్ కుమార్‌ల స్ఫూర్తితో కొత్త బ్యానర్ స్థాపించి కొత్త వారికి ఛాన్స్ ఇస్తున్నారు.
'కొత్తలవాడి' 'టీజర్ అదుర్స్
Just In
పుష్ప అరుణ్ కుమార్ నిర్మాతగా రూపొందించిన ఫస్ట్, లేటెస్ట్ మూవీ 'కొత్తలవాడి' (Kothalavadi). టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీ అంబార్ (Pruthvi Ambaar) హీరోగా.. కావ్య శైవ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీకి సిరాజ్ రచన, దర్శకత్వం వహిస్తుండగా తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ హైప్ పెంచేసింది.
మూవీలోని పాత్రలన్నింటినీ ఇంట్రడ్యూస్ చేస్తూ యాక్షన్ ఎలివేషన్స్ భారీగా ఇస్తూ రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమాటోగ్రాఫర్ కార్తీక్ అందించిన సూపర్బ్ విజువల్స్, అభినందన్ కశ్యప్ కంపోజ్ చేసిన పవర్‌ఫుల్ బీజీఎం ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నాయి. హీరో పృథ్వీ అంబర్ రగ్డ్, ఎనర్జిటిక్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. రూటెడ్, పవర్‌ఫుల్ స్టోరీతో మూవీ వేరే లెవల్ అని టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. రా కంటెంట్‌తో తెరకెక్కుతోన్న ‘కొత్తలవాడి’ చిత్రంలో ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది.
ఈ మూవీలో పృథ్వీ అంబార్‌తో పాటు గోపాల్ దేశ్ పాండే, కావ్య శైవ, రాజేష్ నటరంగ, అవినాష్, మన్షి సుధీర్, రఘు రమణకొప్ప, చేతన్ గంధర్వ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ద్వారా ఇద్దరు కొత్త సంగీత దర్శకులు పరిచయం అవుతున్నారు. వికాష్ వశిష్ట సినిమాలోని పాటలకు మ్యూజిక్ అందిస్తుంటే, అభినందన్ కశ్యప్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. రఘు నీనందల్లి డైలాగ్స్ రాశారు. రామిశెట్టి పవన్ ఎడిటర్‌గా, దినేష్ అశోక్ పోస్టర్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.
'కొత్తలవాడి' అనేది కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకాలో ఉన్న ఓ గ్రామం. మూవీలో ఎక్కువ భాగం ఇక్కడే చిత్రీకరించారు. స్టోరికి సంబంధించి స్థానికత, దాని మూలాలకు నిజమైన రీతిలో ఉండేలా మూవీ టీం స్థానిక యాసను సైతం డైలాగ్స్‌లో ఉపయోగించినట్లు తెలుస్తోంది.
'మాస్‌గా ఉండొద్దని చెబుతుంటా'
తన కుమారుణ్ని సిల్వర్ స్క్రీన్‌పై స్టైలిష్‌గా చూడాలని అనుకుంటున్నట్లు యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ (Yash Mother) తెలిపారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె మాట్లాటారు. స్టైలిష్‌గా ఉండాలని చెబితే.. 'అలా ఉంటే ఎవరు చూస్తారమ్మా? నీ కోసం సినిమా చేయాలా?' అని యష్ అడుగుతుంటాడని అన్నారు. యష్‌ను మాస్‌గా ఉండొద్దని చెబుతుంటానని చెప్పారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2లో రఫ్ లుక్‌లో యష్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన టాక్సిక్, రామాయణ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు.