Top Courses After 12th in India : ఇంటర్ తర్వాత ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో తెలుసా? ఇండియాలో ఇవే టాప్
ఇటీవలే CBSE ఇంటర్ ఫలితాలు ప్రకటించింది. అనేక రాష్ట్ర బోర్డులు కూడా ఫలితాలు ప్రకటించాయి. ఈ ఫలితాల తర్వాత ఏ కోర్సులో జాయిన్ అయితే మంచిదో అనే ఆలోచన పేరెంట్స్, పిల్లల్లో ఉంటుంది.
అయితే ఇంటర్ తర్వాత ఇండియాలో ఏ కోర్సు జాయిన్ అయితే మంచిదో.. అసలు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం.
ఇంటర్లో మీరు ఎంచుకున్న స్ట్రీమ్ని బట్టి డిగ్రీ లేదా బీటెక్ లేదా ఇతర కోర్సులు తీసుకునే ఆప్షన్ ఉంటుంది.
మీరు సైన్స్ స్ట్రీమ్ తీసుకుంటే.. ఇంటర్ తర్వాత బీటెక్, మెడికల్, బీఎస్సీ, బీఫార్మాసీ, బీఏ, బీబీఏ వంటి కోర్సులు చేయవచ్చు.
ఇంటర్లో కామర్స్ చదివితే.. మీరు బీకామ్, బీబీఏ, సీఏ, సీఎస్, సీఎమ్ఏ వంటి కోర్సులను కెరీర్ కోసం ఎంచుకోవచ్చు.
ఆర్ట్ స్ట్రీమ్ తీసుకున్నవారు ఇంటర్ తర్వాత బీఏ, బీబీఏ, బీఏ ఎల్ఎల్బీ, బీజేఎంసీ, బీహెచ్మెం వంటి కోర్సులు తీసుకోవచ్చు.
మీకు ఆసక్తి ఉన్న వాటికి అనుగుణంగా అనేక డిప్లొమా కోర్సులు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చిన, మీరు చేయగలిగే వాటిని ఎంచుకుంటే మంచి ఫలితాలు చూడవచ్చు.