PF Balance Check : ఒక్క మిస్డ్ కాల్‌తో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. నెంబర్ ఇదే

పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి (Image Source : Envato)
మీరు ఉద్యోగం చేస్తున్నట్లైతే కచ్చితంగా మీకు పీఎఫ్ అకౌంట్ ఉండే ఉంటుంది. అయితే మీరు దానిలో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే మీరు కష్టపడాల్సిన అవసరం లేదు.
పీఎఫ్ అకౌంట్‌ని తెలుసుకునేందుకు మీరు ఓ నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. 9966044425 నెంబర్‌కు మీ పీఎఫ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వండి.
ఆ నంబర్‌కి మిస్డ్ కాల్ ఇస్తే మీకు క్షణాల్లోనే మెసేజ్ వస్తుంది. దీనితో మీ పీఎఫ్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఇట్టే తెలిసిపోతుంది.
మీరు మిస్డ్ కాలే కాదు.. 7738299899కు మీరు మెసేజ్ చేయడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు EPFO TEL అని మెసేజ్ చేస్తే డిటైల్స్ వస్తాయి.
TEL అంటే తెలుగు. మీరు ఇతర భాషల్లో చెక్ చేసుకోవాలనుకుంటే మీ భాషల్లోని మొదటి మూడు అక్షరాలను టైప్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.