Cyber ​​Security and Cyber ​​Intelligence: ఆధునిక ప్రపంచంలో దోపిడీలు, దొంగతనాలుకూడా ఆన్ లైన్ అయిపోాయయి. డేటాతోనే మాయ చేస్తున్నారు. మనకు తెలియకుండా మన ఖాతాల్ని ఖాళీ చేస్తున్నారు. అందుకే సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఇంటలిజెన్స్ అనేది నేటి రోజుల్లో అత్యంత కీలకంగా మారింది. ఈ అంశంపై డాక్టర్ ప్రసాద్ పాటిబండ్ల, డైరక్టర్, రీసెర్చ్ అండ్ ఆపరేషన్స్, సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబర్ ఇంటలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ ఏబీపీ ఎడ్యూ కాంక్లేవ్ లో కీలకమైన విషయాలను వెల్లడించారు. 

Continues below advertisement


నేటి యువత ఒకటికి ముంచి సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగిస్తున్నారు. ఇష్టం వచ్చిటలుగా పోస్టింగ్ చేస్తున్నారు. కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి పోస్టు సోషల్ మీడియాలో రికార్డు అయిపోతుందన్నారు. అది ఎప్పటికీ ఉంటుందని.. దాన్ని  కనిపించకుండా చేసనా...డిలీట్ చేసినా శాశ్వతంగా పోదని స్పష్టం చేశారు. వాటి ఆధారంగా వ్యక్తిని అంచనా  వేస్తారని.. వ్యక్తిత్వాన్ని కొలుస్తారని తెలిపారు. వ్యక్తిగత సమాచారం కూడా.. ఇతరుల చేతుల్లోకి వెళ్లే అవకాసశం ఉందన్నారు. 
 
 సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడానికి యాక్టివ్ ,  పాసివ్ ఇంటలిజెన్స్ రెండింటినీ ఉపయోగించే అవకాశం ఉందని తెలిపారు.   ఒక సంస్థ  సెక్యూరిటీ బలహీనతలను కనుగొనడానికి సిమ్యులేటెడ్ సైబర్ దాడులు నిర్వహించడం. యాక్టివ్ ఇంటలిజెన్స్,  సోషల్ మీడియా లేదా డార్క్ వెబ్ నుండి సమాచారాన్ని సేకరించి, సంభావ్య సైబర్ క్రిమినల్ యాక్టివిటీని విశ్లేషించడం పాసివ్ ఇంటలిజెన్స్ అని తెలిపారు. 


సైబర్ సెక్యూరిటీలో ఓపెన్-సోర్స్ ఇంటలిజెన్స్ (OSINT) టూల్స్ ఉపయోగించి సోషల్ మీడియా, వెబ్‌సైట్‌లు, లేదా డార్క్ వెబ్ నుండి సమాచారం సేకరించడం కీలకమని తెలిపారు.   బెదిరింపులను గుర్తించడానికి బహిరంగ డేటాబేస్‌లు, న్యూస్ ఆర్టికల్స్, లేదా ఎక్స్ పోస్ట్‌లను విశ్లేషించడం.. లాగ్ ఫైల్స్ లేదా ఇప్పటికే సేకరించిన డేటాను విశ్లేషించడం, సిస్టమ్‌తో ఇంటరాక్ట్ చేయకుండా డిజిటల్ ఫోరెన్సిక్స్‌లో ప్రయత్నించవచ్చన్నారు. ఈ విధంగా ఇంటలిజెన్స్ ను ప్రయోగిస్తే.. అవతలి వ్యక్తులు గుర్తించే  ప్రమాదం తక్కువన్నారు.  ఎక్కువ సమయం తీసుకోవచ్చు, కానీ సురక్షితమైన విధానమని  దాహరణకు, సైబర్ క్రిమినల్స్ గురించి సమాచారం సేకరించడానికి డార్క్ వెబ్ ఫోరమ్‌లలోని డేటాను పాసివ్‌గా విశ్లేషించవచ్చన్నాు.                                    


సైబర్ సెక్యూరిటీ లోపాలను కనుగొనడానికి నెట్‌వర్క్ లోపాలను కనుగొనడానికి పెనెట్రేషన్ టెస్టింగ్ లేదా ఎథికల్ హ్యాకింగ్ నిర్వహించడం ఒకటిననారు.  సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్‌లను ఉపయోగించి సమాచారాన్ని సేకరించడం   ఫిషింగ్ సిమ్యులేషన్‌లు) ఉపయోగించడం.. సైబర్ ఇంటలిజెన్స్ లో ముఖ్యమన్నారు.  ఒక సిస్టమ్‌లో లైవ్ డేటాను సేకరించడానికి యాక్టివ్ స్కానింగ్ లేదా ఇంటరాక్టివ్ టూల్స్ ఉపయోగించడం డిజిటల్ ఫోరెన్సిక్స్‌లో ఉంటున్నారు.                  


డాక్టర్ ప్రసాద్ పాటిబండ్ల... సైబర్ సైక్యూరిటీ, సైబర్ ఇంటలిజెన్స్ పై విద్యార్థులకు సైతం తెలియని ఎన్నో విషయాలను ఏబీపీ ఎడ్యూ కాంక్లేవ్ లో వివరించారు. ఆ లింక్ ఇక్కడ