మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ ముక్కు కోశాడు. వాళ్లిద్దరు.. లీవ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. డబ్బులు అడిగితే ఇవ్వలేదని.. గొడ్డలితో కోసేశాడు. నిందితుడు లవ్ కుష్ పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..
పటేల్ అనే వ్యక్తి.. రెండేళ్లుగా సోనూ అనే మహిళతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఓ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం మద్యం కొనుగోలు చేసేందుకు రూ.400 ఇవ్వాలని లవ్ కుష్.. అడిగాడు. అయితే ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన అతడు అక్కడే ఉన్న గొడ్డలిని అందుకుని సోను ముక్కును కోశాడు. ఆమె కేకలు విన్న ఇరుగుపొరుగు వారు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అయితే ఆ సమయానికి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
'పోలీసులు వచ్చే సమయానికి పటేల్ పారిపోయాడు. సోనుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. పటేల్ కోసం వెతకడం ప్రారంభించాం. సాయంత్రం వరకు అతడిని అరెస్టు చేశాం. అతడిని కోర్టు ముందు హాజరుపరిచాం. ప్రస్తుతం అతడు జైలులో ఉన్నాడు' అని కొత్వాలి పోలీస్ అధికారి బల్జీత్ సింగ్ బిషెన్ చెప్పారు.
Also Read: కొత్త సంవత్సరం కానుక! జనవరి 1న రైతుల ఖాతాల్లో డబ్బులు వేయనున్న మోదీ