తెలుగులో ఎక్కువ డ్యూయల్ రోల్స్, ట్రిపుల్ రోల్స్ చేసిన తెలుగు హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని ఒకరు. సుమారు 30 సినిమాల్లో ఆయన ఒకటి కంటే ఎక్కువ పాత్రలు చేశారు. ఇప్పుడు ఆయన అల్లుడు సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. అందులో ఆయన ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. ఈ రోజు సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. "ఆట మొదలైంది" అని సుధీర్ బాబు ట్వీట్ చేశారు. 'జనతా గ్యారేజ్' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేశారు. ఇప్పుడు సుధీర్ చేస్తున్నారు.





సుధీర్ బాబు, హర్షవర్ధన్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న‌ ఈ సినిమాను సోనాలి నారంగ్‌, సృష్టి స‌మ‌ర్ఫ‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 5గా  నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. హీరోగా సుధీర్ బాబుకు 15వ సినిమా ఇది. తొలి ట్రిపుల్ రోల్ సినిమా. ఏ పాత్రకు ఆ పాత్రే వైవిధ్యంగా ఉంటుందట. యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. పీజీ విందా సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.


Also Read: బికినీలో సమంత... న్యూ ఇయర్ సెల‌బ్రేష‌న్స్ అక్క‌డేనా!?
Also Read: సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన బాలయ్య.. ఆ పని అద్భుతమని ప్రశంసలు
Also Read: కార్తీక్-దీప ఉన్న ఊర్లోకి మోనిత పనిమనిషి ప్రియమణి ఎంట్రీ.. కథలో మరో మలుపు.. కార్తీక దీపం డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..
Also Read: ఆ కేసులో ఇరికిస్తారనే భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్
Also Read: వసు విషయంలో రిషికి క్లారిటీ ఇచ్చిన జగతి.. గౌతమ్ ప్రేమకి అడ్డుతగులుతున్న ఈగో మాస్టర్, గుప్పెడంత మనసు డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి