Kolkata Doctor Death Case Updates: కోల్‌కతా హత్యాచార కేసులో నిందితుడి తరపున కోర్టులో వాదనలు వినిపించేందుకు ఇప్పటి వరకూ ఏ లాయర్ ముందుకు రాలేదు. ఇన్ని రోజులకు ఓ మహిళా అడ్వకేట్‌ సంజయ్ రాయ్‌ తరపున వాదించేందుకు అంగీకరించారు. 52 ఏళ్ల కబితా సర్కార్‌ తన పాతికేళ్ల కెరీర్‌లో అత్యంత కీలకమైన కేసు ఇదే. సీల్దా కోర్ట్ ఎంతో మంది లాయర్స్‌ని సంప్రదించింది. నిందితుడి తరపున వాదించాలని కోరింది. కానీ ఎవరూ ఆసక్తి చూపించలేదు. చివరకు కబితా సర్కార్ అందుకు ఒప్పుకున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని అందరిలానే కోరుకుంటున్నాని చెబుతున్న ఆమె కోర్టు ట్రయల్ పూర్తయ్యాకే అదంతా జరగాలని అన్నారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ న్యాయపరమైన హక్కులుంటాయని స్పష్టం చేశారు.


"ఎవరేమన్నా నా డ్యూటీ అయితే నేను చేయాలి" అని తేల్చి చెబుతున్నారు కబితా సర్కార్. అంతే కాదు. మీడియాలో ఎక్కడా తన ఫొటో పబ్లిష్ చేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఉరి శిక్ష వేయాలన్న డిమాండ్‌పైనా కబితా సర్కార్ స్పందించారు. వ్యక్తిగతంగా తాను ఎప్పుడూ ఇలాంటి శిక్షలకు మద్దతునివ్వనని స్పష్టం చేశారు. జీవితఖైదు కన్నా పెద్ద శిక్ష ఇంకేమీ ఉండదని అన్నారు. (Also Read: Kolkata: డాక్టర్ చెంపలు పెదాలు మెడపై చీరుకుపోయిన గాయాలు, క్రూరత్వానికి పరాకాష్ఠ)


"దయచేసి నా ఫొటో ఎక్కడా పబ్లిష్ చేయొద్దు. అందరికీ నాపై కోపం వస్తుందేమో. నన్ను ఎవరో ఏదో చేస్తారని కాదు. కేసుని అనవసరంగా తప్పుదోవ పట్టించడం నాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరికీ కోర్టు ట్రయల్ జరిగి తీరాల్సిందే. నిందితుడికైనా ఈ హక్కు ఉంటుంది. నా ఉద్యోగం నేను చేస్తున్నాను. ఇప్పటి వరకూ అతని తరపున వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడే కాదు. గతంలోనూ నాకు ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. నా జీతంలో నుంచి డబ్బులు తీసి బెయిల్ బాండ్‌ కోసం కట్టిన రోజులూ ఉన్నాయి. నిందితుడి తరపున వాదించాలని కోర్టు నన్ను కోరింది. అందుకే వెంటనే అంగీకరించాను"


- కబితా సర్కార్, నిందితుడి తరపున న్యాయవాది


డాక్యుమెంట్స్ పరిశీలన..


హుగ్లీ మొషిన్ కాలేజ్‌లో లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కబితా సర్కార్...అలిపోర్ కోర్ట్‌లో సివిల్ కేసులతో తన కెరీర్‌ని ప్రారంభించారు. 2023లో క్రిమినల్ లాయర్‌గా కెరీర్ మొదలు పెట్టారు. 2023 జూన్‌లో సీల్దా కోర్టుకి బదిలీ అయ్యారు. ఇప్పటి వరకూ తన కెరీర్‌లో ఈ కేసు చాలా కీలకమైందని చెబుతున్నారు. కేసు డాక్యుమెంట్స్‌ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. 


"ఇప్పటి వరకూ నా కెరీర్‌లోనే హైప్రొఫైల్ కేసు ఇది. కేసుకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్‌ చదవడమే నా మొట్ట మొదటి పని. ఆ తరవాత బెయిల్ పిటిషన్‌ వేస్తాను. నా తల్లిదండ్రులకు ఇదంతా నేను చెప్పలేదు. చెబితే భయపడిపోతారు. తమ కూతురికి ఏమైపోతుందో అని ఆందోళన పడతారు. నా భర్త మాత్రం నాకు అండగా నిలిచారు"


- కబితా సర్కార్, నిందితుడి తరపున న్యాయవాది 


 Also Read: Kolkata: దేశంలో ఇన్ని అత్యాచారాలు జరగడం దారుణం, కఠిన చట్టం చేయండి - మోదీకి మమతా లేఖ