Telangana: తెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్- జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ

Uttam Kumar Reddy: తెలంగాణలో తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ప్రజలకు జనవరి నుంచి సన్న బియ్యం ఇవ్వబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Continues below advertisement

Good News For White Card Holders In Telangana:తెలంగాణలో ఎప్పటి నుంచో చర్చలో ఉన్న సన్న బియ్యం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి నుమంచి తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇవ్వబోతున్నట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర స్థాయి విజిలెన్స్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్‌రెడ్డి సన్నబియ్యంపై ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 

Continues below advertisement

పౌరసరఫరాల శాఖపై ఉన్న స్థాయి సమీక్ష నిర్వహించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రజలకు న్యాణమైన బియ్యం అందించేందుకు ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆలోచన చేస్తోందని అన్నారు. దీన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకున్నామని... పూర్తిగా అధ్యయనం, చేసి బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేలా చేస్తున్నట్టు తెలిపారు. రేషన్ షాపుల్లో ఇచ్చిన బియ్యాన్ని ఎవరైనా పక్కదారి పట్టిస్తే మాత్రం కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

తెలంగాణలో తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యంతోపాటు కావాల్సిన వారికి రాయితీపై గోధుమలు కూడా ఇచ్చే ఆలోచన ఉన్నట్టు ఉత్తమ్‌ వివరించారు. అదే టైంలో డీలర్ల సమస్యలు గురించి కూడా మంత్రి ఆరా తీశారు. వాటిని అడ్రెస్‌ చేయాల్సిన అవసరం ఉందున్నారు. రాష్ట్రంలోని చౌక ధరల దుకాణాల్లో ఇంకా 1629 ఖాళీలు ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీటన్నింటిపై పది రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు. 

తెలంగాణలో ఇప్పుడు ఉన్న అంత్యోదయ కార్డులు మరింత మందికి ఇచ్చే అంశంపై కూడా అధ్యయనం చేయాలని అధికారులను ఉత్తమ్ ఆదేశించారు. గురుకుల పాఠశాలల్లో, హాస్టళ్లు, అంగన్‌వాడీలకు అందజేస్తున్న న్యూట్రీషన్ రైస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వీటిపై ఫిర్యాదులు రాకుండా జాగ్రత్త పడాలని ఆ దిశగా పనిచేయాలన్నారు. ఇప్పటి వరకు పౌరసరఫరాల శాఖ ద్వారా అందిస్తున్న పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వివిధ మార్గాల్లో ప్రజలకు ఆ సమాచారం చేరేలా చూడాలని తెలిపారు. ఇలా చేస్తే అర్హులు ఎరైనా ఉంటే అప్లై చేసుకుంటారని అన్నారు. 
 

Continues below advertisement