వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధితో పాటు పక్క జిల్లాలోని మద్యం షాపులతో పాటు ఫర్టిలైజర్, కిరాణా దుకాణాల లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పర్వతగిరి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన దొంగల నుంచి రూ.76 వేల నగదు, రెండు కరెంటు మోటార్లు, పీవీసీ పైపులు, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.శరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర్ గ్రామం టూక్య తండాకు చెందిన అజ్మీరా హేమ(40), అజ్మీరా మోహన్ (42), మాలోత్ వీరన్న (45) ఉన్నారు. ఇందులో ఆజ్మీరా హేమ, అజ్మీరా మోహన్ ఇద్దరు స్నేహితులు... కలిసి మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవారు. 


Also Read: పెళ్లైన రెండు నెలలకే భార్యను అమ్మేసిన భర్త.. ఆమెకు ఏం చెప్పి అమ్మాడో తెలుసా!


మద్యానికి బానిసలై మద్యం షాపులో చోరీలు


జల్సాలకు డబ్బు సరిపోకపోవడంతో హేమ, మోహన్ చోరీలు చేయడం మొదలు పెట్టారు. సుమారు యాభైకి పైగా చోరీలకు పాల్పడి పలుమార్లు అరెస్టు కూడా అయ్యారు. తాజాగా దేవరుప్పుల పోలీస్ స్టేషన్ పరిధిలోని వైన్ షాపులో చోరీకి పాల్పడ్డారు. అరెస్టై జైలుకు వెళ్లారు. కొద్ది రోజులకు జైలు నుంచి విడుదలయ్యారు. మద్యానికి బానిసలై మరోసారి చోరీలకు సిద్ధపడ్డారు. నిందితులు ఒక ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేసి పగటి సమయాల్లో గ్రామ శివారు ప్రాంతాల్లో ఉండే మద్యం షాపులను గుర్తించి రాత్రి సమయాల్లో షాపు షటర్ తాళాలు పగులగొట్టి మద్యం సీసాలతో పాటు క్యాష్ కౌంటర్లోని డబ్బులు చోరీ చేసేవారు. షాపులోని సీసీ కెమెరాలతో పాటు, డీవీఆర్‌ను దొంగిలించి ధ్వంసం చేసేవారు. ఇదే రీతిలో నిందితులిద్దరూ ఇప్పటి వరకు మొత్తం 14 చోరీలకు పాల్పడ్డారు. ఇందులో సిద్దిపేట జిల్లాలో రెండు ఫరీలైజర్ దుకాణాలు, ఒక వైన్ షాపు, ఒక కిరాణాషాపుతో సహా మొత్తం నాలుగు చోరీలకు పాల్పడగా, సంగెం పరిధిలో రెండు, ఐనవోలు, రఘునాథ్ పల్లి, దుగ్గొండి, గీసుగొండ, వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున వైన్ షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. 


Also Read: మహిళ వాట్సాప్ కు నీలి చిత్రాలు... కిటికీ దగ్గర వింత అరుపులు... యువకుడి వెకిలి చేష్టలు


మరో వ్యక్తితో కలిసి కరెంటు మోటార్ల దొంగతనం 


కొంకపాక గ్రామంలో నిందితులు మరో నిందితుడు మాలోత్ వీరన్నతో కలిసి రెండు మార్లు చోరీకి పాల్పడి రెండు కరెంటు మోటార్లతో పాటు, పది పీవీసీ పైపులను చోరీ చేయగా సంగేం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైస్ మిల్లులో రెండు తూనికల యంత్రాలను చోరీ చేశారు. ఈ దొంగతనాలపై మామూనూర్ డివిజన్ పోలీసులు డీసీపీ వెంకటలక్ష్మీ, ఎసీపీ నరేష్ కుమార్‌లకు అందిన సమాచారం మేరకు ఆదివారం ఉదయం పర్వతగిరి పోలీసులు సోమారం వద్ద వాహన తనీఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై కరెంట్ మోటారును తీసుకోస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 


Also Read: నల్గొండ జిల్లాలో విషాదం... ప్రేమను చంపుకోలేక ప్రాణాలు తీసుకున్నారు...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి