ఏపీలో నిన్నటి వరకూ బహిరంగ విమర్శలు చేసుకున్న నేతలు... ఇప్పుడు ట్విట్టర్ లో విరుచుకుపడుతున్నారు. దీక్షలు, ధర్నాలు, నిరసనలతో నిన్నటి వరకూ మైకుల్లో తిట్టుకున్న నేతలు ఇవాళ ట్విట్టర్లో తిట్టుకుంటున్నారు. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు తారాస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. లెటెస్ట్ గా ట్విట్టర్లో ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. 






'చంద్రబాబు నిజమే. నేను విశ్వాసఘాతుకుడినే. అది నీ ఒక్కడికి మాత్రమే. కానీ నువ్వు.. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, హరికృష్ణ, దగ్గుబాటి, మోడీ, అమిత్‌షా లాంటి పెద్దలకు నమ్మకద్రోహివి..వెన్నుపోటుదారుడివి అంటూ విమర్శించారు. అంతేకాదు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, జనసేన పార్టీలకు కూడా నమ్మకద్రోహివి అంటూ ట్వీట్ చేశారు. వెన్నుపోట్లు, నమ్మకద్రోహాలకు, విశ్వాసఘాతుకాలకు నిఖార్సైన పేటంట్‌ దారుడివి నువ్వే' అని ఆరోపించారు వల్లభనేని వంశీ. ఇంకా తాను కేసీఆర్‌ కి పొర్లు దండాలు పెడితే.. చంద్రబాబు చేస్తున్నదేంటి.. ఓటుకు నోటు కేసు తేలేవరకు అంతేగా అని వంశీ ట్విట్టర్లో ప్రశ్నించారు. 






సజ్జల డైరెక్షన్లో వంశీ : కొల్లు రవీంద్ర


ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు చేశారు. వంశీ మాట్లాడుతున్న భాష చాలా దారుణంగా ఉందన్నారు. కృష్ణా జిల్లాకు చెడ్డపేరు తీసుకొస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి, తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచిన వంశీ, ఇవాళ చంద్రబాబు, లోకేశ్‌ గురించి మాట్లాడుతున్నారన్నారు. వంశీ మాట్లాడుతున్న భాష వింటే ఆయన భార్య, పిల్లలు కూడా సిగ్గుపడే పరిస్థితి ఉందన్నారు. కృష్ణా జిల్లా మహిళలను కించపరిచేలా వంశీ వ్యాఖ్యలు ఉన్నాయని కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు భిక్షతో ఎమ్మెల్యే అయిన వంశీ సజ్జల డైరెక్షన్‌లో మాట్లాడుతున్నారని ఆరోపించారు.


లోకేశ్ ను గెలిపించుకోండి


టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షలో మాజీ మంత్రి పరిటాల సునీత చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. తాను రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు. ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ పరిటాల సునీతను తాను ఎప్పుడూ వదినగానే భావించానని, ఆమె తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. వచ్చే ఎన్నికల వరకు ఎందుకు తాను ఇప్పుడే రాజీనామా చేస్తానన్నారు. చంద్రబాబు... తల్లికి, గర్భస్థ శిశువుకు కూడా గొడవలు పెట్టగల వ్యక్తి అని వంశీ ఆరోపణలు చేశారు. పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్‌ అయిన వల్లభనేని వంశీ గన్నవరంలో రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. పరిటాల సునీత ముందుండి లోకేశ్ ను గెలిపించుకోవాలని సవాల్‌ చేశారు. 


Also Read: పరిటాల సునీతకు వల్లభనేని వంశీ ఓపెన్ ఛాలెంజ్... అలా చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధం...!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి