ప్రేమించానన్నాడు, జీవితాంతం తోడై ఉంటానన్నాడు. ఆ మాటలు నమ్మిన యువతి పెళ్లికి ఒప్పుకుంది. పెద్దల అంగీకారంతో ఇద్దరూ పెళ్లి(Marriage) చేసుకున్నారు. జీవితాంతం అండగా ఉంటానని మాటలు చెప్పి తీరా పెళ్లి చేసుకుని మూడు సంవత్సరాలు గడవకముందే తన భార్య అందంగా లేదంటూ వేధింపులకు దిగాడు. భర్త వేధింపులు తట్టుకోలేని ఆ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకుంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా(Vikarabad District) తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. జిన్గుర్తి గ్రామానికి చెందిన మహేష్ యాలాల మండలం దేవనూరు గ్రామానికి చెందిన సునీత (23)ను ప్రేమించి పెళ్లి(Love Marriage) చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు సజావుగా జరిగిన వీరి కాపురంలో తగాదాలు మొదలయ్యాయి. ఈ చిన్న తగాదాలు పెద్దవయ్యాయి.
మహేష్ తన భార్యను అందంగా లేవంటూ నువ్వు చనిపోతే మరో వివాహం చేసుకొని దర్జాగా ఉంటానంటూ వేధించేవాడని సునీత బంధువులు ఆరోపిస్తున్నారు. మహేష్ సునీతను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేసేవాడని ఆరోపించారు. ఈ మధ్యకాలంలో వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో తట్టుకోలేని సునీత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. తన చెల్లెలు మహేష్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలు సునీత సోదరి అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో కరణ్కోట్ పోలీసులు(Police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భర్తపై అనుమానంతో భార్య ఆత్మహత్య
భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని గంపలగూడెం మండలం అనుమల్లంక గ్రామానికి చెందిన నాగబత్తిన నాగేంద్రబాబుకు కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన భాగ్యమ్మ (27)తో 8 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగేంద్రబాబు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భాగ్యమ్మకు అనుమానం వచ్చింది. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో భాగ్యమ్మ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. ఆమె మృతదేహాన్ని తిరువూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు పోలీసులు.
Also Read: Vijayawada Crime: బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందా, ప్రియుడి అరెస్టుతో గుట్టురట్టు