Vijayawada Student Hospitalised: విజయవాడ: నగరంలోని ఏనికేపాడులో దారుణం జరిగింది. ఓ వ్యాపారి నిర్లక్ష్యం ఓ డిగ్రీ విద్యార్థి పరిస్థితి ప్రాణాల మీదకి తెచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాహంగా ఉందని వాటర్ బాటిల్ కోసం వెళ్లిన యువకుడికి దుకాణాదారుడు వాటర్ బాటిల్ బదులుగా యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. మంచినీళ్లు అనుకుని తాగడంతో విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. 


అసలేం జరిగిందంటే.. 
చైతన్య అనే యువకుడు లయోలా కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతడికి దాహంగా ఉందని షాప్ దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్ కొనుక్కున్నాడు. దాహంగా ఉండటంతో ఏమీ చూసుకోకుండా బాటిల్ ఉన్నది వేగంగా తాగేశాడు చైతన్య. ఆ తరువాత ఒక్కసారిగా చైతన్య కూర్చుండిపోయాడు. కడుపులో మంటగా ఉందని స్నేహితుడికి చెప్పాడు. ఏం జరిగిందని చెక్ చేయగా.. డిగ్రీ విద్యార్థి తాగింది నీళ్లు కాదు యాసిడ్ అని గుర్తించారు. 


విద్యార్థి చైతన్య వాటర్ బాటిల్ అడిగితే ఆ దుకాణదారుడు యాసిడ్ బాటిల్ నిర్లక్ష్యంతో యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. దాంతో యాసిడ్ కడుపులోకి వెళ్లడంతో ఒక్కసారిగా మండినట్లు అనిపించి చైతన్య కుప్పకూలిపోయాడని కుటుంబసభ్యులు, స్నేహితులు చెబుతున్నారు. యాసిడ్ కారణంగా అతడి అవయవాలు కొన్ని కాలిపోయినట్లు తెలుస్తోంది. చైతన్య కుప్పకూలగానే స్నేహితుడు అతడ్ని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, చైతన్య వైద్యానికి కావాల్సిన బిల్లు నగదు కోసం కళాశాల యాజమాన్యం విరాళాలు సేకరిస్తోంది. దాతలు సహకరించాలని చైతన్య కుటుంబసభ్యులు కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చిన దుకాణాదారుడిపై చర్యలు తీసుకోవాలని ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. 


Also Read: Honor Death in Yadadri: కూతురు లవ్ మ్యారేజ్, అల్లుడ్ని పిలిచిన మామ - మాయమాటలు చెప్పి కిరాతకం


Also Read: Kamareddy Case: తల్లీకొడుకుల ఆత్మహత్య - రామాయంపేట మున్సిపల్ చైర్మన్ సహా ఏడుగురిపై కేసు నమోదు, పరారీలో నిందితులు