Easter 2022 wishes: AP CM YS Jagan And Telangana CM KCR extends greetings to Christians
యేసుక్రీస్తు పునరుజ్జీవనానికి గుర్తుగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. వసంత కాలంలో లేదా పౌర్ణమి తర్వాత ఈస్టర్ వస్తుంది. ఈస్టర్ 2022ను పురస్కరించుకుని ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్, మరికొందరు ప్రముఖులు ఈస్టర్ విషెస్ తెలిపారు.
సత్యం పట్ల విశ్వాసానికి ఉన్న శక్తిని తెలిపిన మహిమాన్వితమైన రోజు ఈస్టర్ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ పండుగ రోజు దేవుని దయతో అందరి హృదయాల్లో శాంతి, ఆనందాలు నిండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ ఈస్టర్ విషెస్.. (KCR Easter Wishes)
క్రైస్తవ సోదరులు జరుపుకునే “ఈస్టర్" పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనిషి కోసం ఏసుక్రీస్తు అనుసరించిన త్యాగ నిరతిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. క్రీస్తు అనుసరించిన ప్రేమ, దయ, శాంతి సహనం, త్యాగం వంటి విలువలు, శత్రువునైనా ప్రేమించమనే ఆదర్శం సమస్త మానవాళి అనుసరించదగినవి అని సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రధాని మోదీ ఈస్టర్ విషెస్..
హ్యాపీ ఈస్టర్! యేసుక్రీస్తు ఆలోచనలు మరియు ఆదర్శాలను మనం గుర్తుచేసుకోవాలి. సామాజిక న్యాయం మరియు కరుణ అనే అంశాలను క్రీస్తు మనకు బోధించారు. మన సమాజంలో సంతోషం మరియు సోదరభావాల స్ఫూర్తిని పెంపొందించాలని ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.
‘మంచి పై కుట్రలు, దౌర్జన్యం చేసి పొందే గెలుపు మూన్నాళ్ళే ఉంటుందనే సందేశాన్ని సమాజానికి అందించడానికి శుక్రవారం ప్రాణత్యాగం చేసిన క్రీస్తు, మూడో రోజే సమాధి నుంచి సజీవుడై తిరిగివచ్చారు. తుది విజయమెప్పుడూ సత్యానిదేనని చాటి చెప్పాడు. క్రైస్తవ సోదరులందరికీ ఈస్టర్ ఆదివారం శుభాకాంక్షలు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.