ఉత్తరాఖండ్ కుమావులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనం లోయలో పడిన ఘటనలో 14 మంది వరకు మృతి చెందారు. సుఖిదాంగ్ రీతా సాహెబ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ఏం జరిగింది?
ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పంచముఖి ధర్మశాలలో జరిగిన పెళ్లికి వీరంతా వెళ్లారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత వీరంతా మహీంద్ర మ్యాక్స్ వాహనంలో తిరిగి తమ స్వస్థలాలకు బయల్దేరారు. తెల్లవారుజామున వాహనం అదుపు తప్పి.. ఒక్కసారిగా రహదారి పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.
ప్రమాదంపై సమాచారం అందుకొని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చంపావత్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పరిహారం
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొంది. ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి పరిహారం అందించనుంది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించినట్లు వెల్లడించింది.
Also Read: Palindrome Date Today: నేటి తేదీ ప్రత్యేకతేంటో తెలుసా? ఎలా చదివినా ఒకలాగే ఉంటుంది