కార్తీకదీపం ఫిబ్రవరి 22 మంగళవారం ఎపిసోడ్


అప్పారావు సంచిలోంచి కిందపడిన  శ్రీవల్లి-కోటేష్ ఫొటో చూసిన మోనిత వాళ్లగురించి, కోటేష్ ఎత్తుకుపోయిన తన బాబు గురించి ఆరా తీస్తుంది. ఆ బాబుని కార్తీక్ ఎత్తుకుని ఉన్న ఫొటో చూపించడంతో షాక్ అవుతుంది మోనిత. నువ్వు నిజమే చెబుతున్నావా అని మోనిత అంటే... బాబుని తీసుకెళ్లి వాళ్లే పెంచుకుంటున్నారని క్లారిటీ ఇస్తాడు అప్పారావు. ( గతంలో బాబుని కార్తీక్ ఆడిస్తుండగా తమ్ముడి కొడుకుపై ఉన్న ప్రేమ సొంత కొడుకుపై ఉండదా అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది). మరోవైపు గుండెనొప్పితో మోనిత బాబాయ్ విలవిల్లాడిపోతుంటే పని మనిషి విన్నీ ట్యాబ్లెట్ తెచ్చి ఇస్తుంది. 


మరోవైపు డాక్టర్ లైసెన్స్ పోవడానికి కూడా మోనిత కారణం అయ్యి ఉండొచ్చు కదా అని గతంలో అన్న మాటలపై దీప ఆలోచనలో పడుతుంది. నిజంగా మోనితలో ఇంత మార్పు వచ్చిందా, బాబాయ్ పై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చినట్టు, వాళ్ల బాబాయ్ కి ఆపరేషన్ చేస్తే మోనితకి ఏంటి లాభం అనుకుని వారణాసికి కాల్ చేస్తుంది. మోనిత బాబాయ్ ని ఆపరేషన్ కోసం తీసుకెళ్లారా అని అడిగితే ఆపరేషన్ రేపు అని చెబుతాడు వారణాసి. అదేంటి ఆపరేషన్ ఈరోజు అని డాక్టర్ బాబు చెబితే మోనిత రేపు అని ఎందుకు అబద్ధం చెప్పిందని డౌట్ వస్తుంది. వెంటనే కార్తీక్ కి కాల్ చేసిన దీప...ఆపరేషన్ ఈరోజా రేపా అని అడుగుతుంది. కార్తీక్ చికాకు పడినప్పటికీ గట్టిగా అడుగుతుంది. ఆపరేషన్ ఈ రోజే అని కార్తీక్ చెప్పడంతో దీప కాల్ కట్ చేసి ఆలోచనలో పడుతుంది. మోనిత ఎందుకు అబద్ధం చెప్పింది, తన బాబాయ్ బతకడం ఇష్టం లేదా అనుకుంటుంది. మరోవైపు పనిమనిషి విన్నీ నుంచి ఎన్ని సార్లు కాల్ వచ్చినా మోనిత లిఫ్ట్ చేయకుండా చికాకుగా ఫోన్ పక్కన పెట్టేస్తుంది. మోనిత ఇంటికి రాగానే దీప ఇంటికి వచ్చి మీ బాబాయ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లిందని చెబుతుంది పనిమనిషి. మీరేం చేస్తున్నారని చికాకు పడుతుంది. కావాలనే బాబాయ్ ని వదిలేసి వెళ్లాను, కావాలనే పనమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయలేదు...మధ్యలోకి దీప ఎలా వచ్చిందని ఆలోచిస్తుంది. 


Also Read: రిషిని ఏవండోయ్ శ్రీవారు అన్న వసుధార, షాక్ అయిన జగతి-గౌతమ్, గుప్పెడంతమనసు సోమవారం ఎపిసోడ్
కట్ చేస్తే హాస్పిటల్లో దీప చెప్పినదంతా విని షాక్ అవుతాడు కార్తీక్. లక్కీగా సరైన సమయానికి తీసుకొచ్చావ్, ఆపరేషన్ సక్సెస్ అయింది ఆయన సేఫ్...డిశ్శార్జ్ అవగానే అమెరికా వెళ్లిపోతానన్నారని చెబుతాడు కార్తీక్. ఇంతలో అక్కడకు వచ్చిన మోనిత నాకు తెలియకుండా మా బాబాయ్ కి ఆపరేషన్ చేస్తావా అని ఫైర్ అవుతుంది. లాగిపెట్టి కొట్టిన దీప నువ్వొక అబద్ధం, నీ బతుకొక అబద్ధం అని క్లాస్ వేస్తుంది. ఆపరేషన్ గురించి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది నీ కాల్ లిస్ట్ లో కూడా ఉంది, నీకు అన్నీ తెలుసు అని దీప అంటుంది. అప్పుడు ఓపెన్ అయిన మోనిత అవును నాకు అన్నీ తెలుసు...కానీ ఎందుకో తెలుసా... కార్తీక్ అంటూ మళ్లీ తన విశ్వరూపం చూపిస్తుంది. మా బాబాయ్ చస్తే... పొర్లి పొర్లి ఏడుస్తూ తన సింపతీ సంపాదించాలని చూశానని చెబుతుంది. చెంపపై కొట్టిన కార్తీక్ అసలు నా గురించి ఏమనుకుంటున్నావ్, పదకొండేళ్లు మేం దూరమయ్యాం, ఇప్పటికైనా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వవా , అసలు ఎవరే నువ్వు అని మండిపడతాడు. దీప అలా చూస్తూ నిల్చుంటుంది.


అలా అంటావేంటి కార్తీక్ అంటూ దీప తాళి చూపిస్తుంది. ఆ తాళిని తెంచేసిన కార్తీక్ ...20 రూపాలు పెట్టి తాడుకొనుక్కుని వేసుకుని తిరిగే దాన్ని తాడు అంటారు కానీ తాళి అనరు..దీని పవిత్రతని మంటగలిపావ్ అంటాడు. తాళి-బంధం-ప్రేమ-ఆప్యాయత వీటి అర్థాలు నీకు తెలియవు చెప్పినా అర్థం కావు...మేం ప్రశాంతంగా బతకాలంటే నీకు ఏం కావాలి అని అడుగుతాడు. ఇదే అవకాశంగా భావించిన మోనిత నా కొడుకు కావాలని అడుగుతుంది. మన బాబు అని నువ్వు అనుకోవడం లేదు కదా..నా బాబుని నాకు వెతికిపెట్టి ఇవ్వు...ఇంకెప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని చెబుతుంది. ఇదే మాటపై ఉంటావా అని కార్తీక్ అడగడంతో.. ఎక్కడున్నాడో తెలియదు ఎలా వెతికి తెచ్చి ఇస్తారని దీప అడిగితే...దీప నువ్వు ఆగు అంటాడు కార్తీక్. ఇవన్నీ వదిలేస్తావా అంటే మాటమీద ఉంటాను మన ప్రేమ మీద ఒట్టు అంటుంది. ఇద్దరూ కొట్టారు కదా ఇంతకు ఇంతకూ పగ తీర్చుకుంటాను, బాబుని ఎక్కడని వెతుకుతావు...నీ ఇంట్లోనే ఉన్నాడని క్రూరంగా నవ్వుకుంటుంది. నీకు ఇప్పట్లో వాడే నా కొడుకు అని తెలియనివ్వను తెలిసే లోగా ఆటను మరింత రసవత్తరంగా మారుస్తా అనుకుంటుంది. నా చెంపపై కొట్టారని గర్వపడుతున్నారేమో మీ ఇద్దరి అనుబంధంపైనా కొట్టబోతున్నా అని అనుకుంటూ వెళ్లిపోతుంది. 


Also Read: దీప ముందు మోనితని లాగిపెట్టి కొట్టిన కార్తీక్, బాబు కావాలంటూ మోనిత కొత్త డ్రామా, కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
సౌందర్య ఇంటికి వెళ్లిన అప్పారావు సందడిగా మాట్లాడుతాడు. నీకు ఇంటి అడ్రెస్ ఎలా దొరికిందని అడిగితే...దార్లో పెద్ద హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ బాబు ఫొటో చూపిస్తే అడ్రస్ చెప్పారంటాడు. అవకాశాలు చూపించండి మేడం అంటే... చేస్తున్న పని వదిలిపెట్టి అవకాశాల కోసం తిరగొద్దు అంటుంది. ఎవ్వరూ కనిపించడం లేదేంటి అని అడిగితే కార్తీక్, దీప బయటకు వెళ్లారంటుంది. 
ఎపిసోడ్ ముగిసింది.


రేపటి  ఎపిసోడ్ లో
అప్పారావు సంచిలో ఉన్న కోటేష్ ఫొటోని చూసిన సౌందర్య కూడా వీళ్లెవరని ఆరాతీస్తుంది. ఆ బాబే ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నాడని తెలియడంతో షాక్ అవుతుంది. ఇంతలో కార్తీక్ వచ్చి బాబుతో ఆడుకోవడం చూసి ఏం జరిగింది అలా ఉన్నాడని దీపని అడిగితే..మోనిత కొడుకుని వెతికి ఇస్తానన్నరాని చెబుతుంది. ఇంట్లోనే ఉన్న బాబుని ఎక్కడని వెతుకుతావురా పెద్దోడా అనుకుంటుంది సౌందర్య...