22/02/2022...
నేటి తేదీ చాలా అరుదుగా వచ్చే సంఖ్య. ఇది పాలిండ్రోమ్ మాత్రమే కాదు, ఆంబిగ్రామ్ కూడా. ఏంటి పాలిండ్రోమ్, ఆంబిగ్రామ్ అని ఆలోచిస్తున్నారా? ఇవి ఒక తేదీ లేదా నెంబర్ ప్రత్యేకతను చెబుతాయి. ముందు నుంచి వెనుకకు, వెనుక నుంచి ముందుకు చదివినా కూడా ఒకేలా ఉండే అంకెను పాలిండ్రోమ్ అంటారు. తలకిందులుగా చదివినా కూడా పైనుంచి కిందకు, కింద నుంచి పైకి ఒకేలా ఉంటే ఆ ప్రత్యేకతను ఆంబిగ్రామ్ అంటారు. నేటి తేదీ ఎలా చదివినా ఒకేలా ఉంటుంది. అందుకే ఇది పాలిండ్రోమ్, ఆంబిగ్రామ్ కూడా. 


నేటి తేదీలోని మధ్యలో స్లాష్ మార్కులు తీసేస్తే 22022022 అవుతుంది. పాలిండ్రోమ్ , ఆంబిగ్రామ్ బ్రిటిష్ తేదీ ఫార్మాట్ లో పనిచేస్తాయి. అంటే dd-mm-yyyy ఈ ఫార్మాట్ అన్నమాట. ఇందులో నేటి డేట్ ముందొచ్చి, నెల రెండో స్థానంలో ఉంటుంది. అదే అమెరికా ఫార్మాట్ లో మనం తేదీని mm-dd-yyyy గా రాస్తాము. ఇందులో నెల ముందుగా రాసి, తేదీ తరువాత రాస్తాము. బ్రిటిష్ ఫార్మాట్ లో చూసుకుంటే నేటి తేదీ చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. 


36 పాలిండ్రోమ్‌లు...
అమెరికా డేట్ ఫార్మాట్లో చూసుకుంటే ప్రస్తుతం మిలీనియం(జనవరి 1, 2001 నుండి డిసెంబర్ 31, 3000 వరకు) లో మొత్తం 36 పాలిండ్రోమ్ లు వస్తాయి. మొదటిది 10 -02-2001 కాగా, చివరిది 09-22-2290 అవుతుంది. 


అదే mm-dd-yyyy డేట్ ఫార్మాట్లో అయితే 21వ శతాబ్ధంలో 12 పాలిండ్రోమ్ రోజులు ఉన్నాయి, మొదటిది అక్టోబర్ 2, 2001 (10-02-2001)న కాగా, చివరిది సెప్టెంబర్ 2, 2090 (09-02-2090)న.  






Also read: మళ్లీ బర్డ్ ఫ్లూ కేసులు, చికెన్ తింటే ప్రమాదమా, బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వస్తుందా?


Also read: కరోనాలాంటి మహమ్మారులు మళ్లీ రాకుండా ఉండాలంటే చెట్లు పెంచాల్సిందే, చెబుతున్న కొత్త అధ్యయనం