Indian Army Vehicle Accident In Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌లో (Jammu Kashmir) శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పహారా కాసేందుకు వెళ్లిన సైనిక వాహనం బందిపొరాలోని (Bandipora) వులార్ వ్యూపాయింట్ వద్ద అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు సైనికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో వాహనంలో ఐదుగురు ఉండగా ఇద్దరు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ అధికారులు క్షతగాత్రులను బందిపొరా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు శ్రీనగర్‌కు అధికారులు వెల్లడించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.










కాగా, వారం రోజుల క్రితం పూంఛ్ జిల్లాలోనూ ఇదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం గరోవా ప్రాంతంలోని 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంచు ఎక్కువగా కురుస్తుండడంతో రోడ్డును అంచనా వేయలేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.


Also Read: Dense Fog Covers Delhi : ఢిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు - ఆలస్యంగా నడుస్తోన్న రైళ్లు - పలు విమానాలు రద్దు