Today Top Headlines In AP And Telangana:


1. వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్


వైసీపీ హయాంలో ఏపీలో 600 కోట్లకు పైగా జరిగిన ల్యాండ్ స్కామ్ సంచలనంగా మారింది. గత 12 నెలలుగా ఏసీబీ నుంచి తప్పించుకుని తిరుగుతున్న సబ్ రిజిస్ట్రార్ ధర్మ సింగ్ ను పోలీసుల అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. గతంలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రారుగా ధర్మ సింగ్ పనిచేశారు. వందల కోట్ల భూములను చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి పేరు మీదకు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేపించారని ధర్మ సింగ్ ఆరోపించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అయితే ఎవరు బెదిరించి ఆ స్థలాలను శ్రీకాంత్ పేరిట రిజిస్ట్రేషన్ చేపించారన్న కోణంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఇంకా చదవండి.


2. ఈ నెల 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు


విజయవాడలో  ఆదివారం " హైందవ సంఖరావం " పేరుతో  భారీ సభను ఏర్పాటు చేసింది విశ్వ హిందూ పరిషత్ హిందూ దేవాలయాల పరిరక్షణ, హైందవ దేవాలయ నిర్వహణ  ధర్మ సంఘాల చేతుల్లోనే ఉండడం వంటి డిమాండ్లతో నిర్వహిస్తున్న  ఈ సభ కోసం ఏర్పాట్లు చేశారు. విజయవాడ సమీపంలోని కేసర పల్లెలో జరుగుతున్న సభ కోసం పోలీసులు ట్రాఫిక్ ని మళ్ళించారు. ఆదివారం విజయవాడలో పోలీస్ ఆంక్షలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఇంకా చదవండి.


3. రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి


కోలీవుడ్ డైరెక్టర్ శంకర్‌, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో గేమ్‌ఛేంజర్‌ మూవీ అప్డేట్‌ గురించి మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. గేమ్‌ చేంజర్‌ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుందని అంతా ఊహించారు. అందరూ ఊహించినట్లుగానే గేమ్‌ఛేంజర్‌ ఈవెంట్‌ మూవీ టీమ్‌ అయితే ముందుగా కాకినాడ జిల్లాలోనే ఏర్పాటు చేయాలనుకుంది. దీనికోసం గత నెల రోజులుగా కూడా కాకినాడ - పిఠాపురం మధ్యలో మెయిన్‌ రోడ్డుకు ఆనుకుని భారీ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు. ఇంకా చదవండి.


4. రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్


ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. రీజనల్ రింగు రోడ్డు (RRR) ఉత్త‌ర  భాగానికి సంబంధించి భూ సేక‌ర‌ణ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల‌కు ప‌రిహారం నిర్ణ‌యించే విష‌యంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. ఆర్బిట్రేట‌ర్లుగా ఉన్న అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు రైతుల‌కు వీలైనంత ఎక్కువ మొత్తం ప‌రిహారం వచ్చేలా చూడాల‌న్నారు. ఇంకా చదవండి.


5. యాదాద్రి జిల్లాలో తీవ్ర విషాదం


యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెద్దకందుకూరులో భారీ పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో ఒక కార్మికుడు మృతిచెందగా.. మరో 10 మంది కార్మికులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సంభవించడంతో కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో కంపెనీ నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇంకా చదవండి.