ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాంతికి రాబోతున్న సినిమాల గురించి చర్చ ఓ రేంజ్ లో సాగుతోంది. సీనియర్ హీరోలు బాలయ్య 'డాకు మహారాజ్', వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలతో థియేటర్లలోకి వస్తుంటే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నతన అభిమానులను పలకరించబోతున్నారు. ఈ సినిమాలన్నీ కూడా రెండు రోజుల వ్యవధిలోనే థియేటర్లలోకి రాబోతున్నాయి. అయితే 'సంక్రాంతికి వస్తున్నాం' టీం మాత్రం ప్రమోషన్ల పరంగా దుమ్ము రేపుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా, దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. 


ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు ప్రేక్షకులకు తెగ నచ్చేసాయి. ఓవైపు ఈ పాటలు మార్మోగిపోతుంటే, మరోవైపు 'సంక్రాంతి వస్తున్నాం' టీం వరుస ప్రమోషన్లతో బిజీ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో ఐశ్వర్య రాజేష్ తో పాటు హీరోయిన్ గా నటిస్తున్న మరో బ్యూటీ మీనాక్షి చౌదరి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆమె ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.


సంక్రాంతి సెంటిమెంట్ 
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ జనవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ "లాస్ట్ ఇయర్ సంక్రాంతికి 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాను. ఇక ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాను. ఫస్ట్ టైం కామెడీ జానర్ లో కాప్ రోల్ ప్లే చేయడం ఎక్సైటింగ్ గా ఉంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కూడా చేశాను. నన్ను నేను నిరూపించుకునే మంచి కథలు, పాత్రలు ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. నిజానికి కాప్ రోల్ చేయాలనేది నా డ్రీమ్. మా డాడీ ఆర్మీ ఆఫీసర్. కాబట్టి ఆఫీసర్ బాడీ లాంగ్వేజ్ పై ఐడియా ఉంది. ఇలా కెరీర్ బిగినింగ్ లోనే ఇలాంటి పాత్ర చేయడం సంతోషంగా ఉంది. 


వెంకీ, అనిల్ రావిపూడితో వర్క్ ఇలా... 
ఇక వెంకటేష్ గారితో వర్క్ చేయడం గురించి మాట్లాడుతూ "ఆయన ఒక వండర్ ఫుల్ హ్యూమన్. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కామెడీ టైమింగ్ అయితే అద్భుతంగా ఉంటుంది. అనిల్ - వెంకీ సూపర్ హిట్ కాంబినేషన్ సెట్లో ఉంటే మంచి ర్యాపో ఉండేది. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఐశ్వర్య రాజేష్ మంచి యాక్టర్. ఆమెతో సినిమా చేయడం ఒక మంచి ఫ్యాన్ మూమెంట్ లా అనిపించింది. తను చాలా పాజిటివ్ గా ఉంటుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడికి చాలా ఓపిక ఎక్కువ. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్" అని చెప్పుకొచ్చింది.


Also Readటీఆర్పీలో మళ్లీ కార్తీక దీపం రికార్డ్ - టాప్ 6లో అన్నీ 'స్టార్ మా' సీరియళ్ళే - ఏ ఛానల్‌లో ఏది టాప్‌లో ఉందో తెల్సా?



బాలయ్య వన్ అండ్ ఓన్లీ ఒజి
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దిల్ రాజు గారు ప్రొడక్షన్లో పని చేయడమే ఒక వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే, ఆయన ప్రమోషన్స్ లో కూడా పాలుపంచుకోవడం ఆనందంగా అనిపించింది. మరోవైపు శిరీష్ కూడా చాలా సపోర్టివ్. వీరి ప్రొడక్షన్ లో మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ కావడం చూశాక, మ్యూజిక్ ఎలా బ్లాక్ బస్టర్ అయిందో... సినిమా కూడా అలాగే హిట్ అవుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు మీనాక్షి. ఇక 'అన్ స్టాపయబుల్' షోలో బాలయ్య గురించి మాట్లాడుతూ 'వన్ అండ్ ఓన్లీ ఓజీ' అన్నారు. "ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో ఒక సినిమా, మరో రెండు సినిమా చేస్తున్నాను" అంటూ తన నెక్స్ట్ మూవీస్ అప్డేట్ ఇచ్చింది.  


Read Alsoప్రభాస్ కజిన్‌ సినిమాతో డైరెక్షన్, ఓసేయ్ రాములమ్మ సెట్‌లో అవమానం, పవన్ గురించి... గణేష్ మాస్టర్ ఇంటర్వ్యూ