Guntur Crime News :   ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసేవాళ్లు మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. వారికి నిజంగా పలుకుడి ఉందో లేదో.. ఉద్ోయగం ఇప్పిస్తారో లేదో తెలియదు. కానీ ఓ ఆశ మాత్రం నిరుద్యోగుల్ని డబ్బులు కట్టేలా చేస్తుంది. ఇలాంటి వారిలో అత్యధికులు మోసపోతూంటారు. అలా మోసపోయిన వారు మహా అయితే మోసం చేసిన వారిపై చీటింగ్ కేసు పెట్టగలరు. అంతే.. ఏమీ చేయలేరు. కానీ  వాళ్లు మత్రం అలా అనుకోలేదు. తామే శిక్ష విధించాలని డిసైడయ్యారు. అతి కూడా అలాంటి శిక్ష కాదు. ఏకం మరణశిక్షనే. విధించేశారు. దర్జాగా తిరుగుతున్నారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు బయటపడాల్సిందే. అలా పడ్డారు. దొరకిపోయారు. 


అన్నమయ్య కీర్తన వివాదం, సింగర్ శ్రావణ భార్గవిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు


గుంటూరు జిల్లా  మేడికోండూరు మండలం పేరేచర్ల కెనాల్ వద్ద హత్య 2016లో గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడింది. గుర్తు పట్టలేని విధంగా ఉంది. ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో గుర్తు తెలియని మృతదేహం అని కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు  ప్రారంభించారు. చిన్న చిన్నగా దొరికిన ఆధారాలను పట్టుకుని ముందుగా అసలు ఆమె ఎవరో గుర్తించారు. ఆ తర్వాత హంతకుల్ని పట్టుకోవడం పెద్ద కష్టం కాలేదు. 


చనిపోయిన మహిళ పేరు ఆకుల భవాని, ఉమ్మడి ఏపీ హైకోర్టులో బెంచ్ గుమస్తాగా పని చేసేది. అయితే ఆమె ఉద్యోగాల పేరుతో యువకుల్ని మోసం చేస్తోందని కేసులు నమోదు కావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఆ తర్వాత కూడా  అదే పని కొనసాగించింది. ఈక్రమంలో కేసర శ్రీనివాసరెడ్డి, నీరుకోండ హేమకుమార్, నీరుకోండ పార్వతీ అనే వాళ్ల  దగ్గర కూడా డబ్బులు వసూలు చేసింది. ఉద్యోగాలిప్పిస్తానని చాలా కాలం తిప్పించుకుంది. చివరికి తాము మోసపోయామని గుర్తించిన వారు తమ డబ్బులు ఇవ్వాలని కోరారు. కానీ ఆకుల  భవానీ ఇవ్వలేదు. 


ఏపీలో అత్యవసర అంబులెన్స్‌కు కాల్ చేయాల్సిన నెంబర్ మారింది- 108కి కాల్ చేస్తే కలవదు !


అడిగి అడిగి వేసారిపోయినకేసర శ్రీనివాసరెడ్డి, నీరుకోండ హేమకుమార్, నీరుకోండ పార్వతీలు ఆకుల భవానీని చంపాలని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్లుగానే నమ్మకంగా పిలిచి ఆమెను చంపేశారు. ఎవరికీ కనిపించకుండా కెనాల్ దగ్గర పడేసి వెళ్లిపోయారు. ఆరేళ్ల వరకూ వారు దర్జాగానే తప్పించుకుని తిరిగారు. కానీ ఆమె ఎవరో గుర్తు పట్టడంతో.. ఆమె వ్యవహారాలన్నీ బయటకు లాగడంతో హంతకులుకూడా దొరికారు. ఆకుల భవానికి డబ్బులు కట్టి అటు ఉద్యోగాలు రాకపోగా.. ఇటు హత్య కేసులో జైలు పాలయ్యారు..ఈ ఆశావహులు.