AP Ambulence Number :  108 నెంబర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ నోటెడ్. రోడ్ మీద ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ప్రతి ఒక్కరూ ముందుగా 108కి కాల్ చేశారా అని ప్రశ్నిస్తారు. లేకపోతే తామే కాల్ చే్తారు. ఎందుకంటే ఆ నెంబర్‌కు కాల్ చేస్తే క్షణాల్లో అంబులెన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 108 విషయాన్ని కొద్ది రోజుల పాటు మర్చిపోవాల్సిందే. ఎందుకంటే.. సాంకేతిక కారణాల వలన 108 నెంబర్ పని చేయడం లేదని ప్రభుత్వం ప్రకటించింది. 


హుండీ ద్వారానే రూ.వంద కోట్లు - రికార్డులు సృష్టిస్తున్న శ్రీవారికి భక్తుల కానుకలు!


 సర్వర్ లో సాంకేతిక కారణాల వలన ఆంధ్రప్రదేశ్ లో 108 , అత్యవసర సర్వీసెస్ ఫోన్ నెంబర్ తాత్కాలికంగా పని చేయడం లేదని..  కావున అంబులెన్స్ సర్వీస్ కొరకు 104(1) కి ఫోన్  చేయవలసిందిగా ప్రజలకు తెలియచేస్తున్నామని..  104, 108 సర్వీసుల అడిషనల్ సీఈవో  మధుసూదన్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు.


ప్రస్తుతం 104 నెంబర్‌తో వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లో ఈ నెంబర్ అంబులెన్స్‌లు సేవలు అందిస్తున్నాయి. అదే సమయంలో 104 నెంబర్ కాల్ సెంటర్‌ను  భిన్న రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. కరోనా సమయంలో 104కి కాల్ చేసి వైద్య సలహాలు పొందేందుకు వినియోగించారు. ఇప్పుడు   ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలపై ఫిర్యాదు చేసేందుకు 104 కాల్ సెంటర్‌ను వినియోగించుకుంటున్నారు.  అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యం, అధిక డబ్బులు డిమాండ్ చేయడం, ఆరోగ్య శ్రీ సేవల్లో అలసత్వం, వాహనాలు అందుబాటులో లేకపోవడం వంటి వాటిపై 104కు ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పుడు నేరుగా 108 సర్వీసుల కోసం 104కి ఫోన్ ఆ తర్వాత ఒకటి నెంబర్ నొక్కితే అత్యవసర అంబులెన్స్‌ను సంఘటనా స్థలానికి పంపిస్తారు.  


నెల్లూరులో మెగా ఆర్టిఫిషియల్ లింబ్స్ క్యాంప్, భారీ సంఖ్యలో హాజరైన దివ్యాంగులు


ఏపీలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున 108, 104 వాహనాసలను ప్రారంభించారు. ప్రత్యేకంగా డిజైన్లు ఏర్పాటు చేశారు. వాటిని ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో నిర్వహణకు తీసుకుంది. ఆ సంస్థే ప్రస్తుతం నిర్వహిస్తోంది. అయితే అందరికీ అర్జంట్ అంబులెన్స్ అంటే 108నే గుర్తుకు వస్తుంది. సర్వర్ సమస్య వస్తే..గంట .. రెండు గంటలు వస్తుంది కానీ.. నేరుగా ఫోన్ నెంబర్‌నే మార్చేంత సమస్య వస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. ఇలా ఎన్ని రోజులు ఉంటుందో ప్రభుత్వం చెప్పలేదు. మళ్లీ వెంటనే సమస్య పరిష్కారం అయితే.. 104 కే ఫోన్ చేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి రివర్స్ అయ్యే అవకాశం ఉంది.