Tadepalli Fire Accident:  గుంటూరు జిల్లా తాడేపల్లి కరకట్టపై భారీ అగ్నిప్రమాదం జరిగింది. అమరావతిలోని ఉండవల్లి కరకట్ట ప్రక్కన అరటి తోటకు నిప్పు పెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. పంట అయిపోయిన అరటి తోటకు నిప్పు పెట్టడంతో కరకట్టకు ఇరు వైపుల మంటలు భారీగా వ్యాపించాయి. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో అధికారులు సకాలంలో స్పందించారు.


సకాలంలో స్పందించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది 
పంట అయిపోయిన అరటి తోటకు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంపై తాడేపల్లి పట్టణ సీఐ సాంబశివరావు స్పందించారు. అరటి తోటకు పెట్టిన నిప్పు భారీ అగ్ని ప్రమాదంగా మారి, కరకట్ట కు ఇరు వైపుల మంటలు వ్యాపించాయని తెలిపారు. పోలీసులు సకాలంలో స్పందించి ఫైర్ ఇంజన్ తెప్పించి, మంటల్ని అదుపులోకి తెచ్చారని సీఐ వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం (Fire Accident Near Chandrababu Home) పక్కనే ఉండటంతో మొదట అధికారులు ఆందోళనకు గురయ్యారు. 


సకాలంలో స్పందించి పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబు నివాసానికి అగ్ని ప్రమాదం ముప్పు తప్పింది. సకాలంలో స్పందించి మంటలను ఆర్పి, తమ పంటల కి ఎలాంటి నష్టం కలగకుండా చేసిన తాడేపల్లి పోలీసులకు ఉండవల్లి పెనుమాక రైతులు కృతజ్ఞతలు తెలిపారు. 


Also Read: TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు


Also Read: Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !