డిశాకి చెందిన శ్రియా లెంక అనే 18 ఏళ్ల యువతి 'K-పాప్' స్టార్ గా మారింది. 'K-పాప్' షోలు ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పటివరకు ఇండియన్స్ ఎవరూ కూడా ఈ షోలలో ఆర్టిస్ట్ గా స్థానం దక్కించుకోలేకపోయారు. అలాంటి శ్రియా తన టాలెంట్ తో 'K-పాప్' స్టార్ గా ఎన్నికైంది. శ్రియాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్, డాన్స్, ఆర్ట్స్ మీద ఆసక్తి ఉండేది. దీంతో తన 12వ ఏట నుంచే పలు రకాల డాన్స్ లలో శిక్షణ తీసుకుంది. 


ఒడిసి క్లాసికల్ డాన్స్, హిప్-హాప్ నేర్చుకుంది. మ్యూజిక్ అండ్ డాన్స్ ను తన కెరీర్ గా మలుచుకోవాలనుకుంది. 2020లో తన 'K-పాప్' స్టార్ గా ఎదగాలని తన జర్నీ మొదలుపెట్టింది. లాక్ డౌన్ సమయంలో పలు 'K-పాప్' గ్రూప్ లకు ఆడిషన్స్ ఇచ్చింది. ఇలా ఎన్నో ఆడిషన్స్ తరువాత సియోల్ లో ట్రైనింగ్ తీసుకోవడానికి ఆమెకి ఛాన్స్ వచ్చింది. 


దాదాపు ఆరు నెలల పాటు తన స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకుంటూ.. టాప్ లెవెల్ కి చేరింది. రీసెంట్ గా పాపులర్ 'K-పాప్' గ్రూప్ బ్లాక్ స్వాన్.. శ్రియాను తమ టీమ్ లో ఐదో మెంబర్ గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఆ విధంగా ఇండియా నుంచి వెళ్లిన శ్రియా 'K-పాప్' స్టార్ గా మారింది. 


ఎవరీ శ్రియా లెంక:


2003లో ఒడిశాలోని రూర్కెలా జిల్లాలో జన్మించింది శ్రియా. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ మీద ఉన్న ఆసక్తితో పట్టుబట్టి మ్యూజిక్, డాన్స్ నేర్చుకుంది. లాక్ డౌన్ సమయంలో కొరియాకు చెందిన 'K-పాప్' గ్రూప్ లలో చోటు దక్కించుకోవాలని ప్రయత్నించింది. కొరియన్ నేర్చుకోవడానికి ఆన్ లైన్ క్లాస్ లలో జాయిన్ అయింది. అలానే పలు కొరియన్ డ్రామాలు చూసింది. కొరియా కల్చర్ పై అవగాహన పెంచుకోవడానికి ఆమెకి కొరియన్ డ్రామాలు బాగా హెల్ప్ అయ్యాయని చెబుతుంటుంది. 


ఇప్పుడు 'K-పాప్' గ్రూప్ లో మెంబర్ గా ఎన్నికైన ఆమెని చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఆమె తండ్రి అవినాష్ లెంక.. ఇండియా నుంచి ఎన్నికైన మొదటి 'K-పాప్' స్టార్ తన కూతురంటూ గర్వంగా మీడియాకి చెప్పారు. చిన్నప్పటి నుంచి తనకు ప్యాషన్ ని కెరీర్ గా మార్చుకుందని.. శ్రియా ఇప్పుడు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిందంటూ చెప్పుకొచ్చారు.


Also Read: ఎన్టీఆర్ శత జయంతి - చిరంజీవి, రాజేంద్రప్రసాద్ ల ఎమోషనల్ కామెంట్స్


Also Read: 'వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే' - తన పీరియడ్ స్టోరీ గురించి చెప్పిన దీపికా పదుకోన్