Yarada Beach In Vizag : యారాడ బీచ్.. విశాఖపట్నం నుండి 15 కిలోమీటర్ల (9.3 మైళ్లు) దూరంలో ఉన్న యారాడలోని బంగాళాఖాతం తూర్పు తీరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో చాలా అందమైన బీచ్‌లలో ఇది ఒకటి. ఇది గంగవరం బీచ్, డాల్ఫిన్స్ నోస్ మరియు గంగవరం పోర్ట్ సమీపంలో ఉంది. అయితే రాష్ట్రంలో యారాడ బీచ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ బీచ్ అందాలను ఆస్వాదించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ ట్వీట్ చేశారు. ఈ వీడియోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి ఆర్కే రోజా, కేంద్ర పర్యాటక శాఖలకు ట్యాగ్ చేశారు ఎంపీ పరిమళ్ నత్వానీ.
మూడు రంగులతో ఆహ్లాదకరంగా..
విశాఖ పరిధిలోని యారాడ బీచ్‌పై వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పరిమళ్ నత్వానీ శనివారం ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. బీచ్ బంగారు, నీలం, ఆకుపచ్చ వర్ణాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. పెద్ద నగరంలో అతి విశిష్టమైనది యారాడ బీచ్, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోందని వీడియో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఏపీ టూరిజం, అమేజింగ్ ఆంధ్రా, దేఖో ఆప్నా దేశ్, ఏపీ టూరిజం లకు ట్యాగ్ చేస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్న యారాడ బీచ్ అందాలను వీక్షించాలన్నారు.
ఏపీలోని అతి పెద్ద నగరం విశాఖపట్నానికి అత్యంత సమీపంలో ఉన్న యారాడ బీచ్ టూరిస్ట్‌లకు డెస్టినేషన్ స్పాట్ అని పేర్కొన్నారు. యారాడ బీచ్‌లో నిక్షిప్తమైన అవక్షేపాల లక్షణాలపై మే 2009 నుండి మే 2010 వరకు శాస్త్రీయ అధ్యయనం నిర్వహించారు. బీచ్‌లో నిక్షేపాలు ఏమేం ఉన్నాయి, కోతల ద్వారా వాటిని ఎలా కోల్పోతున్నాం అనే దానిపై అధ్యయనంలో పలు విషయాలు గుర్తించారు.
Also Read: Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!