AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం

ఇదివరకే పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తయింది. జూన్ 8 నుంచి 10 తేదీల మధ్య ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.

Continues below advertisement

ఏపీలో ఈ ఏడాది టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ లీకుల వివాదంలో జరిగాయి. అయితే జూన్ 10వ తేదీలోగా ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇదివరకే పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తయింది. జూన్ 8 నుంచి 10 తేదీల మధ్య ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలు విడులయ్యాక, జులై రెండో వారంలో టెన్త్ క్లాస్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది. 

Continues below advertisement

ఏపీలో ఇంటర్ ఫలితాలు జూన్ చివరి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఫలితాలు ప్రకటించిన తరువాత అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు కనీసం నెల రోజుల వ్యవధి ఉండేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అంటే జూన్ చివరి వారంలో ఏపీ ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలైతే, జులై చివరి వారంలో లేదా ఆగస్టు నెలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు జూనియర్ కాలేజీలు జులై 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీలో ఇంటర్ కాలేజీలకు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ఇదివరకే విడుదల చేశారు.

తెలంగాణలో ముగిసిన టెన్త్ ఎగ్జామ్స్.. ఫలితాలు ఎప్పుడంటే
TS 10th Exam Results: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శనివారం (మే 28న) జరిగిన సాంఘిక పరీక్షతో పరీక్షలు ముగిశాయి. చివరి రోజు పరీక్షకు మొత్తం 5,03,114 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులకు జూన్‌ 1 వ తేదీన చివరి పరీక్ష జరగనుంది. ఆ మరుసటి రోజు నుంచి అంటే జూన్‌ 2 నుంచి తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ ప్రారంభిస్తారు. జూన్‌ 25 లోపు టెన్త్ రిజల్ట్స్ ప్రకటించాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది. 

తెలంగాణలో మే 23న ప్రారంభమైన టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ శనివారం నాడు ముగిశాయి. గత ఏడాది వరకు పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్ల పరీక్షలు ఉండేవి. కరోనా వ్యాప్తి తరువాత పరీక్షల నిర్వహణ సాధ్యం అవకపోవడంతో రెండేళ్లు నేరుగా విద్యార్థులను తరువాతి తరగతులకు ప్రమోట్ చేశారు. ఈ ఏడాది పదకొండు పేపర్లకు బదులుగా 6 పేపర్లకు పరిమితం చేయడంతో ఒకే వారంలో పరీక్షలు పూర్తయ్యాయి. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ను పెంచేశారు. ఈ ఏడాది  5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 99 శాతం మంది) పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 2,861 కేంద్రాలను ఏర్పాటు చేయగా 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 99 శాతం మంది హాజరయ్యారు. సాధ్యమైనంత త్వరగా స్పాట్ వ్యాల్యుయేషన్ పూర్తి చేసి వచ్చే నెలాఖరులోగా ఫలితాలు విడుదల చేయనున్నారు.

Continues below advertisement