Vijayasai Reddy Satires On TDP Mahanadu: ఓ వైపు మహానాడుతో తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి వారికి సీట్లు దక్కుతాయో, ఎవరి పరిస్థితి ఏంటన్నది టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టత ఇచ్చారు. పని చేసే వారికే పార్టీ టికెట్లు ఇస్తామని, భజన చేసే వాళ్లు ఆశలు వదులుకోవాలని టీడీపీ అధిష్టానం స్పష్టత ఇచ్చింది. అయితే శనివారంతో ముగిసిన టీడీపీ మహానాడుపై వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చివరాఖరికి మహానాడు మనోవేదన ఏంటంటే: ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లోనూ తూర్పు తిరిగి దణ్ణం పెట్టుకోవడమేనని వ్యాఖ్యానించారు.


TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి
2019 అసెంబ్లీ ఎన్నికల ముందు175 సీట్లలో గెలుస్తామని నారా లోకేశ్ ప్రగల్బాలు పలికారని, కానీ టీడీపీకి వచ్చింది మాత్రం 23 సీట్లేనని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. మహానాడులో టీడీపీ నేతలు మాట్లాడుతూ 30 సీట్లలో అభ్యర్థులు లేరని అంటున్నారు. అసలు150 స్థానాలకు టీడీపీ పార్టీకి క్యాండిడేట్లు కష్టమని ఒప్పుకున్నట్టేనా అని సెటైర్లు వేశారు. నారా లోకేష్, మాజీ మంత్రి యనమల ఇద్దరూ ఎమ్మెల్సీ పదవులను వదులుకోవాలని, త్యాగమూర్తులు అనిపించుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు.






రాజకీయాల్లో పార్టీ వ్యవస్థాపక దినం అనేది పొలిటికల్ పార్టీకి, నేతలకు ఒక ముఖ్యఘట్టం. ఎవరైనా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, సంక్షేమం పైన చర్చలు జరుపుతారు. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడం చూస్తుంటాం. గెలుపు అసంభవమని అర్థమైంది కాబట్టే ప్రయోజనకర సమీక్షలు లేకుండా ఆత్మస్తుతి, పరనిందలతో మహానాడును జోకర్ల సభలా మార్చాడు చంద్రబాబు అంటూ వరుస ట్వీట్లు చేశారు విజయసాయిరెడ్డి.


చివరాఖరికి మహానాడు మనోవేదన ఏంటంటే: 
2024లో కూడా 
T తూర్పు తిరిగి
D దణ్ణం🙏          
P పెట్టుకోవడమే.






Also Read: Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !