Srikakulam Crime News: శ్రీకాకుళం జిల్లా బుడుమూరు నాగరాజు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఎస్డీ కేఎన్ఆర్ పేరిట ఫోన్ కాల్స్ చేస్తూ.. లక్షల్లో కాజేశాడు. నమ్మకంగా మాట్లాడుతూనే లక్షలు కొల్లగొట్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోని వివిధ కార్పొరేట్ కంపెనీల కార్యాలయాలకు ఫోన్ చేసి వర్ధమాన రంజీ క్రికెట్ ఆటగాళ్లకు క్రికెట్ కిట్లు కోసం నగదు ఇవ్వాలని బెదిరించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మోసపూరత ఫోన్ కాల్స్ పట్ల కార్పొరేట్ కంపెనీలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇలా ఎవరికైనా అలాంటి ఫోన్ కాల్స్ వస్తే.. వెంటనే పోలీసులకు తెలపాలని జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక.. పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. నిన్న జాతీయ రహదారిపై స్కూటీ మీద తిరుగుతూ అక్రమంగా గంజాయి తరలిస్తున్న కేసులో నాగరాజు నిందితుడిగా ఉన్నాయి. అయితే పోలీసులు ఇతడిని విచారించగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చా యి.


కేటీఆర్ పీఏ అని చెప్తూ లక్షల్లో దోచేసిన నాగరాజు


బుడుమూరు నాగరాజు చెడు వ్యసనాలకు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఎలాగైనా అక్రమంగా డబ్బు సంపాదించాలని చెడు ఉద్దేశంతో ఈ తరహా మోసాల చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అలాగే ఇంటర్ నెట్ లో గూగుల్ సెర్చ్ ద్వారా వివిధ కార్పొరేట్ కంపెనీలు, వాటి సీఈఓలు అయా కంపెనీలు ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్స్ జాబితాను సేకరించేవాడు. ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఏస్డీ కె నాగేశ్వరరావు పేరుతో పాటుగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేటిఆర్ పీఏ మాట్లాడుతున్నానని నమ్మబలికి, బెదిరింపులకు పాల్పడి వివిధ కార్పొరేట్ కంపెనీలు సీఈఓ, మేనేజర్ ల వద్ద నుంచి పెద్ద మొత్తంలో లక్షల రూపాయలను కాజేసినట్లు వివరించారు.


ఏపీలో 15, తెలంగాణలో 10 కేసులు..


తనకు సంబంధించిన అకౌంట్ లకు ట్రాన్స్ ఫర్ చేపించుకుని మోసాలకు పాల్పడ్డాడు. ఇప్పటికే నాగరాజుపై ఆంధ్రప్రదేశ్ లో 15 కేసులు, తెలంగాణలో 10 కేసులు నమోదు అయ్యాయి. బెయిల్ పై బయటకు వచ్చి ఈ విధమైన మోసాలుకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలియజేశారు. ఇలాంటి ఫేక్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందజేయాలని కోరారు. బుడుమూరు నాగరాజుపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక తెలిపారు.