Hyderabad Accident : రోడ్డు మీద ఒక్క గుంత చాలు ప్రాణం తీయడానికి. వేగంగా వెళ్తున్న బండి గుంతలో పడితే జరిగేది ప్రమాదమే. ప్రాణాలు దక్కుతాయో లేదో చెప్పడం కష్టం. అలాంటి గుంత ఒకటి హైదరాబాద్‌లో ఓ యువకుడి ప్రాణం తీసింది. అయితే అతను రోడ్డు పరిస్థితిని చూసుకోకుండా వేగంగా డ్రైవ్ చేయడం లేదు. అసలు వాహనం మీద కూడా వెళ్లడం లేదు. చివరికి రోడ్డు కూడా దాటడం లేదు. కానీ ఆ గుంత కారణంగా ప్రాణం మాత్రం పోయింది.
హైదరాబాద్‌లో కొత్త గ్యాంగ్ హల్‌చల్ - ఇలాంటివారిని పనిలో పెట్టుకుంటే ఇల్లు గుల్లే!
చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారికి ఓ పక్కన ఉండే సోహైల్ హోటల్లో పని చేస్తూంటాడు మహమ్మద్ జాహెద్. అతను హోటల్లో పని చేస్తున్నప్పుడు రోడ్డుపై వాహనాలు గుంతల్లో పడటం చూశాడు. దాని వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురుగాయపడ్డారు కూడా. దాంతో అతని మనసు చివుక్కుమంది. అదో ఒకటి వేసి ఆ గుంతను పూడిస్తే చాలా మంది ప్రమాదాల బారి నుంచి బయట పడతారని భావించాడు. అంతే.. కొంత మంది మట్టి తీసుకుని వెళ్లి ఆ పని చేయబోయాడు. కానీ అదే అతని పాలిట శాపమైంది.
తండ్రిని బెల్టుతో, కర్రతో కొట్టిన కొడుకు, నేచురల్ డెత్‌గా నమ్మించేందుకు ప్రయత్నం! గుట్టు బయటికి ఇలా
అతను గుంతను పూడుస్తున్న సమయంలో ఓ వ్యక్తి అత్యంత వేగంగా ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ కారు ఎంత వేగంగా వెళ్తోందంటే.. జాహెద్ పది అడుగుల దూరం ఎగిరిపడ్డాడు. స్పాట్‌లో చనిపోయాడు. అయితే ఆ కారు మాత్రం ఆగలేదు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. పోలీసులు వాటిని సేకరించి కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
ఆగని లోన్ యాప్ ల వేధింపులు, పెద్దపల్లి జిల్లాలో యువకుడు ఆత్మహత్య
రోడ్డుపై గుంత పూడిస్తే పలువురు ప్రాణాలు నిలుస్తాయని మంచితనంతో ఆలోచించిన జాహెద్.. చివరికి ఆ గుంతను పూడ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఒక వేళ జాహెద్ ఆ సమయంలో గుంతను పూడ్చానికి వెళ్లకపోయి ఉంటే అతన్ని ఢీకొట్టిన కారు ఖచ్చితంగా ఆ హోల్‌లో పడి స్కిడ్ అయి ఎటు బోల్తాపడి ఉండేదో చెప్పడం కష్టం. కానీ జాహెద్ వారి ప్రాణాలను కాపాడాడు. తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇప్పుడా గుంత అంతే నిర్వికారంగా ఉంది. ఎవరైనా ఇక గుంతను పూడ్చే ఆలోచన చేస్తారా ?