Shraddha Murder Case: ఢిల్లీలో సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. శ్రద్ధా వాకర్ ప్రియుడు, నిందితుడు అఫ్తాబ్ అమిన్ పూనావాలా అక్టోబర్ 18వ తేదీన ఓ బ్యాగును భుజాలకు తగిలించుకుని తన ఇంటి నుంచి వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఢిల్లీ పోలీసులు సంపాదించారు. ఆ బ్యాగులో శ్రద్ధకు డెడ్ బాడీ ముక్కలు ఉండొచ్చునని, వాటిని పారవేయడానికి అఫ్తాబ్ వెళ్తున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడు తనతో సహజీవనం చేసిన శ్రద్ధ అనే యువతిని చంపేసి, మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి నగరంలోని వివిధ ప్రదేశాలలో వాటిని పారేశాడని దర్యాప్తులో తేలింది. మృతదేహాన్ని ముక్కులు చేసి కొన్నింటిని ఫ్రిజ్ లో దాచిపెట్టి రాత్రివేళ ఆమె ముఖాన్ని చూసేవాడని దర్యాప్తులో వెల్లడించాడు. మృతదేహం ముక్కలు తన గదిలో ఉన్న సమయంలోనే మరో యువతిని రూమ్‌కు తీసుకొచ్చానని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.


సీసీటీవీ ఫుటేజీ లభ్యం.. 
శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు పోలీసు కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఐదు రోజుల పాటు అఫ్తాబ్ కస్టడీని పొడిగించింది. అంతేకాకుండా నిందితుడికి నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. నిందితుడు అఫ్తాబ్ కూడా పరీక్షకు సమ్మతి తెలిపాడు. ఆరు నెలల క్రితం జరిగిన శ్రద్ధ అనే యువతి హత్య కేసును ఛేదించినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో అఫ్తాబ్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని దిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. అయితే ఈ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తాజాగా అఫ్తాబ్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.






తనతో సహజీవనం చేసిన యువతిని హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికిన అఫ్తాబ్ అమీన్ పూనావాలా (Aftab) గురించి రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. 28 ఏళ్ల యువకుడు ఇంత కిరాతకంగా హత్య చేసి, దీని నుంచి తప్పించుకునేందుకు చేసిన పనులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అయితే ఆ యువకుడు 'డెక్స్‌టర్' (Web Series Dexter) అనే డ్రామా వెబ్ సిరీస్ ద్వారా 'స్పూర్తి' పొందాడని దర్యాప్తులో తేలింది. 


నిందితుడు మామూలోడు కాదు! 
డెక్స్‌టర్ అనేది సీరియల్ కిల్లింగ్స్‌కు సంబంధించిన ఓ క్రైమ్ సిరీస్. ఇందులో వ్యక్తి పోలీసులకు ఫోరెన్సిక్ టెక్నీషియన్‌గా పని చేస్తాడు. కానీ ఖాళీ సమయంలో క్రూరమైన నేరస్థులను చంపుతూ ఉంటాడు. ఈ సిరీస్ చూసిన అఫ్తాబ్.. ఇందులో చూపించినట్లుగా ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించినట్లు తేలింది.


కాల్ సెంటర్‌లో చేరడానికి ముందు అఫ్తాబ్ చెఫ్‌గా పని చేసినట్లు సమాచారం. కాబట్టి శరీరాన్ని కత్తి సాయంతో ఎలా కట్ చేయాలో అఫ్తాబ్‌కు బాగా తెలుసు. అఫ్తాబ్ ఒక రిఫ్రిజిరేటర్‌ని తీసుకువచ్చాడని, అందులోనే శ్రద్ధా శరీర భాగాలను 18 రోజుల పాటు దాచినట్లు అధికారులు తెలిపారు.