సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో విషాదం నెలకొంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. రెండ్రోజులుగా కనిపించలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అమీన్‌పూర్ వందనపురి కాలనీలో ఏడేళ్ల చిన్నారితో పాటు భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. షాద్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్, ఆల్వాల్‌కు చెందిన అనామికకు 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి స్నిగ్ధ(7) అనే పాప ఉంది. శ్రీకాంత్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. అనామిక ఓ కార్పొరేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు.
Also Read: హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్... ఒక్కడే ఐదు చోట్ల స్నాచింగ్... !
ఆత్మహత్యలపై అనుమానాలు
శ్రీకాంత్, అనామిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. రెండు రోజులుగా శ్రీకాంత్, అనామిక కనిపించలేదు. అనామిక తండ్రి ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. వందనపురి కాలనీలోని శ్రీకాంత్ ఇంటికి వెళ్లి చూశారు. ఇంటి తలుపులు తెరిచి చూడగా... శ్రీకాంత్ కుటుంబం విగతజీవులుగా పడిఉన్నారు. శ్రీకాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నారు. ఏడేళ్ల చిన్నారితో పాటు తల్లి నురగలు కక్కుతూ విగతజీవులుగా పడిఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే వారి నుదుటన పెద్దగా ఎర్రటి బొట్లు ఉండడం, పూజగదిలో దేవుళ్ల చిత్ర పటాలు తిరిగబడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఆత్మహత్యలపై పలు అనుమానాలు వ్యక్తం అవ్వడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: క్రెడిట్ కార్డు గురించి ఈ డీటైల్స్ గూగుల్‌లో అస్సలు వెతకొద్దు! అలా చేసినందుకు రూ.1.3 లక్షలు లూటీ
జగిత్యాలలో దారుణం
తెలంగాణలోని జగిత్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల తారకరామనగర్‌లో ముగ్గురిని హత్య చేశారు. తండ్రి నాగేశ్వరరావు, ఇద్దరు కుమారులు రాంబాబు, రమేశ్‌లను ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హత్య చేశారు. కుల సంఘం సమావేశం జరుగుతుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రాల నెపంతో ముగ్గురిని హత్య చేసినట్లు స్థానికులు అంటున్నారు. ఈ హత్యల సమాచారం అందుకున్న అదనపు ఎస్పీ రూపేష్‌కుమార్, డీఎస్పీ ప్రకాశ్, సీఐ కృష్ణకుమార్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసేందుకు కారణాలపై విచారణ చేపట్టారు.
Also Read: ప్రగతిభవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డి హల్ చల్.. లోనికి వెళ్లే ప్రయత్నం.. వెనక్కి పంపేసిన పోలీసులు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి