హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో బుధవారం ఐదు చోట్ల చైన్ స్నాచింగ్ జరగగా, మరోచోట చైన్ స్నాచింగ్ చేసేందుకు విఫలయత్నం జరిగింది. ఈ ఆరు నేరాలు చేసింది ఒక వ్యక్తే అని పోలీసులు గుర్తించారు. ఒంటరిగా స్కూటీపై తిరుగుతూ ఐదు చోట్ల బంగారపు గొలుసులు ఎత్తుకెళ్లాడు. ఆరో చోట మహిళ ప్రతిఘటించడంతో గొలుసు చిక్కలేదు. హైదరాబాద్ నగరంలోని పేట్‌బషీరాబాద్, మారేడ్‌పల్లి, మేడిపల్లి, తుకారాంగేట్ ఠాణాల పరిధిలోఈ నేరాలు జరిగాయి. ఓ యువకుడు తలకు టోపీ పెట్టుకుని ముఖానికి మాస్క్‌ ధరించి స్కూటీపై ప్రయాణిస్తూ చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిర్థారించారు. ఒక్కసారే ఇన్ని నేరాలు జరగడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సంచరించిన వాహనం మంగళవారం ఆసిఫ్‌నగర్‌ పరిధిలోని చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. 


Also Read: క్రెడిట్ కార్డు గురించి ఈ డీటైల్స్ గూగుల్‌లో అస్సలు వెతకొద్దు! అలా చేసినందుకు రూ.1.3 లక్షలు లూటీ


2018 డిసెంబర్ లో ఇలాంటి ఘటనలు 


హైదరాబాద్ లో ఇటీవల చైన్ స్నాచింగ్ ఘటనలు తగ్గాయి. పోలీసులు పహారా, సీసీ కెమెరాల్లో నిరంతర నిఘాతో కేసులు కాస్త తగ్గాయి. అయితే సడన్ గా మళ్లీ ఒక్కరోజే చైన్ స్నాచింగ్ ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. 2018 డిసెంబర్‌లో చివరిలో నగరంలో స్నాచర్లు విజృంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని బవారియాకు చెందిన ఓ గ్యాంగ్‌ రెండు రోజుల వ్యవధిలో 9 ప్రాంతాల్లో స్నాచింగ్ చేశారు. ఈ గ్యాంగ్‌ను వారం రోజుల్లోనే హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ తరహా ఘటనలు గత రెండేళ్లుగా మళ్లీ చోటుచేసుకోలేదు. కానీ బుధవారం ఒక్కరోజు ఆరు ప్రాంతాల్లో స్నాచింగ్ జరగడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. 


Also Read: ప్రధానిపై దాడికి ఉగ్రకుట్ర.. సంచలన విషయాలు వెల్లడించిన నిఘానివేదిక !?


పోలీసులకు కోవిడ్... స్నాచర్ కు ఛాన్స్ 


జీహెచ్ఎంసీ పరిధిలో కోవిడ్ కేసులు పెరుగుతుండడం, అధికంగా పోలీసులు కోవిడ్ బారిన పడుతుండడంతో గస్తీ కాస్త తగ్గింది. గడిచిన కొన్ని రోజుల్లో  దాదాపు 800 మంది పోలీసులకు పాజిటివ్‌ రావడంతో ఐసోలేషన్‌కు వెళ్లారు. దీని ప్రభావం పోలీసింగ్‌తో పాటు ఠాణాల నిర్వహణ, గస్తీపై ప్రభావం పడింది. ఈ విషయాన్ని గమనించిన ఓ చైన్‌ స్నాచర్‌ అదను చూసుకుని గస్తీ లేని ప్రాంతాల్లో  పంజా విసిరాడు. పేట్‌బషీరాబాద్‌ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీ, రాఘవేంద్ర కాలనీ, శ్రీరామ్‌నగర్‌ కాలనీ, ఇంద్రపురి రైల్వే కాలనీ, తుకారాంగేట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న సమోసా గార్డెన్స్‌ వద్ద స్నాచింగ్‌ కు పాల్పడ్డాడు. రాచకొండ కమిషనరేట్‌లోని మేడిపల్లి పరిధిలో ఉన్న బోడుప్పల్‌ లక్ష్మినగర్‌ కాలనీలో స్నాచింగ్ కు యత్నించాడు. మొత్తం 18.5 తులాల బంగారాన్ని స్నాచర్లు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. స్నాచర్‌ కోసం టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. 


Also Read: ప్రగతిభవన్‌ వద్ద జేసీ దివాకర్ రెడ్డి హల్ చల్.. లోనికి వెళ్లే ప్రయత్నం.. వెనక్కి పంపేసిన పోలీసులు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి