Versity Professor Arrested In Abused Case In Tirupati: తిరుపతిలోని (Tirupati) శ్రీవెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో విద్యార్థినిపై వేధింపులు కలకలం రేపాయి. ఈ కేసులో ఓ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కళాశాలలో మొదటి సంవత్సరం బ్యాక్‌లాగ్ విద్యార్థిని తిరిగి ప్రవేశం పొంది తరగతులకు హాజరవుతోంది. విద్యార్థిని పట్ల క్రాప్ ఫిజియాలజీ విభాగాధిపతి ఉమామహేశ్ తరగతి గదిలోనే అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దృశ్యాలు మొబైల్ కెమెరాలో రికార్డయ్యాయి. ఒంటరిగా ఉన్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేసిన ఉమామహేష్‌ను.. వర్శిటీ ఫ్లైఓవర్ వద్ద అరెస్ట్ చేసినట్లు తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు తెలిపారు.


Also Read: Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత