Software Engineers Died In A Road Accident In Hyderabad: అతి వేగం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. మితిమీరిన వేగంతో బైక్ నడపగా డివైడర్‌ను ఢీకొని ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మృతి చెందారు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోరబండకు (Borabanda) చెందిన ఆకాన్ష్, రఘుబాబు అర్ధరాత్రి సమయంలో బోరబండ నుంచి మాదాపూర్ (Madhapur) వెళ్తుండగా.. 100 ఫీట్ రోడ్డులోని పర్వత్‌నగర్ చౌరస్తా సమీపంలో బుల్లెట్ బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలిలోనే ఒకరు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. బైక్ నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని.. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి.


Also Read: Sajjanar: 'ఆ కంపెనీని దేశం విడిచి వెళ్లాలని తీర్పు' - ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సజ్జనార్ ట్వీట్