చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు ఘరానా మోసానికి పాల్పడింది  ఓ మహిళ. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. సుమారు రూ.5.60 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏపీలోని ప్రకాశం జిల్లా చినగంజాం పంచాయతీలోని సోపిరాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం సోపిరాలకు చెందిన పోలకం ఝాన్సీలక్ష్మి, వెంకటస్వామి భార్యభర్తలు. వెంకటస్వామి మిలటరీలో పనిచేసి రిటైర్ అయ్యారు. తర్వాత అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించి కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ఝాన్సీలక్ష్మి సుమారు 25 ఏళ్లుగా సోపిరాలలో ఉంటూ చిట్టీ పాటలు నిర్వహిస్తున్నారు. ఆమెపై నమ్మకంతో రూ. లక్ష, రూ.2 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 10 లక్షల చొప్పున చిట్టీలు పాడేవారు. ఆ మహిళ సుమారు రూ.5.60 కోట్లు  మేర చెల్లించాల్సి ఉంది.


Also Read: Hyderabad News: డబ్బులియ్యకపోతే వీడియో టెలికాస్ట్ చేస్తా.. రిపోర్టర్ బెదిరింపులు, చివరికి..


హైదరాబాద్ లో ఆస్తులు 


కొన్ని నెలలుగా ఆ మహిళ బాకీలు చెల్లించడం లేదు. ఇటీవల తన ఇంటిని సైతం ఝాన్సీలఙ్మీ అమ్మేసింది. చిట్టీల నగదుతో హైదరాబాద్, చీరాల పట్టణాల్లో విలువైన భవనాలు, ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిట్టీ పాటలు పాడిన వారికి డబ్బులు చెల్లించకపోవడం, అప్పులు తీసుకున్నవారికి ఇవ్వకుండా తిప్పుకుంటూ వస్తున్నారు. డబ్బు తిరిగి చెల్లించాలని బాధితులందరూ గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. డబ్బును కుటుంబ సభ్యులు, బంధువులకు ఇచ్చినట్టు ఝాన్సీలక్ష్మీ చెప్పుకొచ్చింది.


Also Read: Moosapet: వేర్వేరుగదుల్లో నిద్రపోయిన భార్యాభర్తలు.. ఉదయం లేచి చూస్తే షాక్!


పోలీసులకు ఫిర్యాదు


చివరికి మోసపోయామని తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ చినగంజాం పోలీసులను శనివారం ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం మహిళ సుమారు 5 కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టినట్లు తెలుస్తోంది. 


 


Also Read: YS Vivekananda Reddy Murder: చాలా అవమానంగా ఉంది... వివేకా హత్య కేసును త్వరగా పరిష్కరించండి... సీబీఐని కోరిన సీఎం మేనమామ


Also Read: Viyanaka Chavithi 2021: బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి వేడుకలు వద్దు.. ఏపీ సర్కార్ ఆంక్షలపై బీజేపీ ఫైర్... ఏకపక్ష నిర్ణయమని విమర్శలు


Also Read: Pocso Case: ఏపీలో దారుణ ఘటన... బాలికపై సామూహిక అత్యాచారం... పోక్సో చట్టం కింద కేసు నమోదు